ఉమ్రాన్ మాలిక్‌ని తప్పించడం బుద్ధిలేని పని!... టీమిండియాపై పాక్ మాజీ క్రికెటర్...

Published : Aug 26, 2022, 11:42 AM IST

ఐపీఎల్ 2022 సీజన్ పర్పామెన్స్‌తో టీమిండియాలోకి బాణంలా దూసుకొచ్చాడు ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్. 150 + కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేసే ఉమ్రాన్ మాలిక్‌ని టీమిండియా సరిగ్గా వాడుకోలేకపోయింది. ఏదో లాంఛనానికి ఇచ్చామన్నట్టుగా రెండు మూడు మ్యాచుల్లో ఉమ్రాన్ మాలిక్‌ని ఆడించిన భారత జట్టు, ఆ తర్వాత అతన్ని పక్కనబెట్టేసింది...

PREV
17
ఉమ్రాన్ మాలిక్‌ని తప్పించడం బుద్ధిలేని పని!... టీమిండియాపై పాక్ మాజీ క్రికెటర్...
Image credit: Getty

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన ఉమ్రాన్ మాలిక్, టీమిండియా తరుపున 3 టీ20 మ్యాచులు ఆడి 2 వికెట్లు తీశాడు. అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారీగా పరుగులు ఇవ్వడంతో ఉమ్రాన్ మాలిక్‌ని పక్కనబెట్టేసింది టీమిండియా మేనేజ్‌మెంట్...

27
Rohit Sharma - Umran Malik

ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత జరిగిన వెస్టిండీస్ టూర్‌లో కానీ, ఆ తర్వాత జింబాబ్వే పర్యటనలో కానీ ఉమ్రాన్ మాలిక్‌కి పిలుపు దక్కలేదు. 150+ వేగంతో బౌలింగ్ చేసి, మెరుపు వేగంతో జట్టులోకి దూసుకొచ్చిన ఉమ్రాన్ మాలిక్, అంతే వేగంగా టీమ్‌లో చోటు కోల్పోయాడు...

37

‘మ్యాచ్‌ గెలవాలంటే పేస్ బౌలర్లే ప్రధానం. టీ20లు కానీ వన్డే, టెస్టు మ్యాచులు కానీ వికెట్లు తీయగల బౌలర్లే మ్యాచ్‌లను గెలిపించగలరు. ఏ ఫార్మాట్‌లో అయినా నిలకడైన ప్రదర్శన ఇవ్వాలంటే వికెట్లు తీయగల బౌలర్లు కావాలి.. బ్యాటర్లు మ్యాచ్‌లను గెలిపిస్తే, బౌలర్లు సిరీస్‌లను గెలిపిస్తారు...

47
Image credit: PTI

ఉమ్రాన్ మాలిక్ విషయంలో టీమిండియా ట్రిక్ మిస్ అయ్యింది. 150+కి.మీ.ల వేగంతో బంతులు వేసే బౌలర్ దొరికినప్పుడు అతను వికెట్లు తీసేంతవరకూ అవకాశాలు ఇవ్వడంలో తప్పులేదు. ఎందుకంటే 150+ వేగంతో బౌలింగ్ చేసే బౌలర్‌ని ఫేస్ చేయడానికి ఏ బ్యాటర్ అయినా భయపడతాడు...

57

అలాంటి ప్లేయర్‌ని సరిగ్గా వాడుకోవడం తెలియకపోవడం టీమిండియా బుద్ధిలేని తనమే. టీ20 వరల్డ్ కప్‌ 2022 సమీపిస్తున్నప్పుడు ఉమ్రాన్ మాలిక్‌కి తుదిజట్టులో వరుస అవకాశాలు ఇచ్చి ఉంటే... వారి బౌలింగ్ యూనిట్ మరింత పటిష్టంగా మారేది...

67
Image credit: PTI

ఉమ్రాన్ మాలిక్‌ బౌలింగ్‌ని మొదటిసారి చూసినప్పుడే నేను చాలా ఇంప్రెస్ అయ్యా. అతను 155 కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేశాడు. అది కూడా కరెక్ట్ ఏరియాల్లో బౌలింగ్ చేయగలుగుతున్నాడు. అంతకుమించి ఇంకేం కావాలి. ఆస్ట్రేలియాలో పిచ్‌లు ఫాస్ట్ బౌలర్లకు చక్కగా అనుకూలిస్తున్నాయి.

77

బౌన్సీ పిచ్‌లను ఉమ్రాన్ మాలిక్‌ అద్భుతంగా వాడుకునేవాడు. జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లతో పాటు ఉమ్రాన్ మాలిక్‌ని సీరియస్ ఫాస్ట్ బౌలర్‌గా మార్చి ఉంటే... భారత ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ భీకరంగా మారి ఉండేది..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఆకీబ్ జావెద్...

click me!

Recommended Stories