ఈ పర్పామెన్స్‌తో ఆసియా కప్ ఆడిస్తారా... ఆ ముగ్గురు భారత బౌలర్లపై తీవ్రమైన ట్రోలింగ్...

Published : Aug 23, 2022, 05:50 PM IST

జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయపడడంతో ఆసియా కప్ 2022 టోర్నీలో ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి కుర్రాళ్లకు అవకాశం కల్పించింది బీసీసీఐ. ఈ ఏడాది అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన ఆవేశ్ ఖాన్, 13 టీ20 మ్యాచుల్లో 11 వికెట్లు పడగొట్టాడు... వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌లో అట్టర్‌ఫ్లాప్ అయిన ఆవేశ్, ఐదో టీ20లో 4 వికెట్లు తీసి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు... అయితే పసికూన జింబాబ్వేపై తేలిపోయాడు ఆవేశ్ ఖాన్...

PREV
18
ఈ పర్పామెన్స్‌తో ఆసియా కప్ ఆడిస్తారా... ఆ ముగ్గురు భారత బౌలర్లపై తీవ్రమైన ట్రోలింగ్...
Image credit: PTI

కమ్‌బ్యాక్ ఇచ్చిన విధానం నచ్చిందో లేక జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయపడడం, మహ్మద్ షమీ ఏడాదిగా ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడకపోవడంతో ఇంకో దారి లేక తీసుకున్నారో కానీ ఆవేశ్ ఖాన్‌కి ఆసియా కప్ 2022 టోర్నీలో అవకాశం ఇచ్చారు సెలక్టర్లు... 

28
Image credit: PTI

దీపక్ చాహార్ వంటి సీనియర్ బౌలర్ ఆరు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉండడంతో అతన్ని స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేసిన సెలక్టర్లు... 13 మ్యాచుల అనుభవం ఉన్న ఆవేశ్ ఖాన్‌పై నమ్మకంతో అతనికి 15 మంది జట్టులో చోటు కల్పించారు...

38
Image credit: PTI

జింబాబ్వే టూర్‌లో మొదటి రెండు వన్డేలకు దూరంగా ఉన్న ఆవేశ్ ఖాన్, మూడో టీ20లో తుది జట్టులోకి వచ్చాడు. ఆరంభంలో ఓ మెయిడిన్‌తో బాగానే వేస్తున్నాడని అనిపించుకున్న ఆవేశ్ ఖాన్... ఆ తర్వాత ధారాళంగా పరుగులు సమర్పించాడు...

48
Sikandar Raza

ఇన్నింగ్స్ 48వ ఓవర్‌లో ఓ రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 5 బంతుల్లో 16 పరుగులు సమర్పించాడు ఆవేశ్ ఖాన్. దీంతో జింబాబ్వే విజయానికి ఆఖరి 13 బంతుల్లో 17 పరుగులు మాత్రమే కావాల్సి వచ్చాయి. ఆఖరి బంతికి లక్కీగా బ్రాడ్ ఎవెన్స్ అవుట్ కావడం, ఆ తర్వాతి ఓవర్‌లో సికందర్ రజా పెవిలియన్ చేరడంతో భారత జట్టు 13 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది...

58
Avesh Khan

మూడో వన్డేలో మొత్తంగా 9.3 ఓవర్లు వేసిన ఆవేశ్ ఖాన్ 3 వికెట్లు తీసిన ఏకంగా 66 పరుగులు సమర్పించాడు. ఇందులో రెండు నో బాల్స్, ఓ వైడ్ కూడా ఉన్నాయి. డెత్ ఓవర్లలో ఆవేశ్ ఖాన్ ధారాళంగా పరుగులు సమర్పిస్తుండడం టీమిండియా ఫ్యాన్స్‌ని కలవరబెడుతోంది...

68
shardul

అలాగే రెండో వన్డేలో 3 వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్, రెండో వన్డేలో 9 ఓవర్లలో 55 పరుగులు సమర్పించాడు. తొలి వన్డేలో 3 వికెట్లు తీసి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చిన దీపక్ చాహార్ 10 ఓవర్లలో 75 పరుగులిచ్చాడు. శార్దూల్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్‌లకు ఆసియా కప్ జట్టులో చోటు దక్కింది...

78
Arshdeep Singh

ఆసియా కప్‌ 2022 టోర్నీ ఆరంభానికి 4 రోజుల ముందు వీళ్లు ఇచ్చిన పర్పామెన్స్, తీవ్ర విమర్శలు రావడానికి కారణమవుతోంది. భువనేశ్వర్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు బౌలర్లు తుది జట్టులో ఆడాల్సి ఉంటుంది. అర్ష్‌దీప్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అదిరిపోయే పర్పామెన్స్ ఇస్తున్నాడు.
 

88

అయితే అర్ష్‌దీప్ సింగ్ కంటే ఎక్కువగా ఆవేశ్ ఖాన్‌పైనే ఎక్కువ నమ్మకం పెట్టుకుంది టీమిండియా. డెత్ ఓవర్లలో భువీతో పాటు బాల్ పంచుకునేందుకు ఓ సరైన బౌలర్ అవసరం. ఆవేశ్, శార్దూల్ పర్పామెన్స్ చూసిన తర్వాత వాళిద్దరి నుంచి బుమ్రా లెవెల్ పర్పామెన్స్ ఆశించడం కష్టం. బుమ్రా, హర్షల్ పటేల్ లేని లోటు.. ఆసియా కప్ 2022లో టీమిండియాపై తీవ్రంగా చూపుతుందా? అనే అనుమానాలు రేగుతున్నాయి. 

click me!

Recommended Stories