శుబ్‌మన్ గిల్‌కి వీరాభిమానిని అయిపోయా... టీమిండియా జెర్సీతో జింబాబ్వే బౌలర్ బ్రాడ్ ఎవెన్స్...

First Published Aug 23, 2022, 5:27 PM IST

శుబ్‌మన్ గిల్... క్లాస్ బ్యాటింగ్‌తో క్రికెట్ విమర్శకుల ప్రశంసలు అందుకున్న యంగ్ క్రికెటర్. వెస్టిండీస్ టూర్‌లో అదరగొట్టిన శుబ్‌మన్ గిల్, జింబాబ్వేతో సిరీస్‌లో సత్తా చాటాడు. మూడో వన్డేలో సెంచరీతో చెలరేగిన శుబ్‌మన్ గిల్, జింబాబ్వేలో అత్యధిక స్కోరు నమోదు చేసిన భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

2022లో రెండు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచిన శుబ్‌మన్ గిల్, వెస్టిండీస్ సిరీస్‌తో పాటు జింబాబ్వేతో వన్డే సిరీస్‌లోనూ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులను దక్కించుకున్నాడు. 2022లో టీమిండియా తరుపున వన్డేల్లో అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులు గెలిచింది గిల్...

మూడో వన్డేలో 83 బంతుల్లో వన్డేల్లో మొట్టమొదటి సెంచరీ పూర్తి చేసుకున్న శుబ్‌మన్ గిల్, జింబాబ్వే గడ్డపై అతి పిన్న వయసులో సెంచరీ నమోదు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అలాగే వన్డేల్లో విదేశాల్లో సెంచరీ చేసిన మూడో చిన్న వయస్కుడు శుబ్‌మన్ గిల్...

Image credit: Getty

ఇంతకుముందు యువరాజ్ సింగ్ 22 ఏళ్ల 41 రోజుల వయసులో ఆస్ట్రేలియాపై సెంచరీ చేస్తే, 22 ఏళ్ల 315 రోజుల వయసులో విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్‌లో సెంచరీ చేశాడు. శుబ్‌మన్ గిల్ ప్రస్తుత వయసు 23 ఏళ్ల 28 రోజులు..  97 బంతుల్లో 15 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 130 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో బ్రాడ్ ఎవెన్స్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు... జింబాబ్వేలో భారత బ్యాటర్‌కి ఇదే అత్యధిక స్కోరు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ చేసిన 127 పరుగుల రికార్డును అధిగమించాడు శుబ్‌మన్ గిల్...

ఈ ఏడాది 6 వన్డేల్లో 112.5 సగటుతో 450 పరుగులు చేశాడు శుబ్‌మన్ గిల్. ఇందులో ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో వర్షం అంతరాయం కలిగించడంతో 98 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచిన శుబ్‌మన్ గిల్... సెంచరీ అందుకోలేకపోయాడు...

‘శుబ్‌మన్ గిల్‌కి నేను వీరాభిమానిని. అందుకే ప్రెస్ కాన్ఫిరెన్స్‌తో గిల్ జెర్సీ తీసుకొచ్చాను. నేను అతనితో కలిసి ఆడడం మరిచిపోలేను. అతను వరల్డ్ క్లాస్ ప్లేయర్... గిల్ సింగిల్ తీసినా చూడముచ్చటగా ఉంటుంది... అతని బ్యాటింగ్‌లో చాలా స్కిల్ ఉంది. దానికి ఎంతో ప్రాక్టీస్ కావాలి. అతని బ్యాటింగ్ చూస్తూ చూస్తూ నేను శుబ్‌మన్ గిల్‌కి ఫ్యాన్ అయిపోయా.

ఇక్కడే కాదు, ఇంతకుముందు ఐపీఎల్‌లో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచిన సమయంలో శుబ్‌మన్ గిల్‌ బ్యాటింగ్ నాకెంతో నచ్చింది... ’ అంటూ కామెంట్ చేశాడు బ్రాడ్ ఎవెన్స్.. టీమిండియాతో జరిగిన మూడో వన్డేలో 5 వికెట్లు తీసిన బ్రాడ్ ఎవెన్స్, సికందర్ రజాతో కలిసి 8వ వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం జోడించాడు.. 

click me!