అవుట్ అవ్వాలని ఎంతో ప్రయత్నించా! కానీ దరిద్రం పట్టినట్టు... వరల్డ్ కప్ మొదటి మ్యాచ్‌పై సునీల్ గవాస్కర్...

Published : Jun 07, 2023, 09:02 PM IST

గూగుల్‌ సెర్చ్‌లోకి వెళ్లి క్రికెట్ చరిత్రలో మోస్ట్ సెల్ఫీష్ ఇన్నింగ్స్ అంటే మొదటి వచ్చేది, 1975 వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై సునీల్ గవాస్కర్ ఆడిన ఇన్నింగ్సే. టీమిండియా ఆడిన మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ ఇదే...

PREV
111
అవుట్ అవ్వాలని ఎంతో ప్రయత్నించా! కానీ దరిద్రం పట్టినట్టు... వరల్డ్ కప్ మొదటి మ్యాచ్‌పై సునీల్ గవాస్కర్...

1975, జూన్ 7న మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ టోర్నీలో మొట్టమొదటి మ్యాచ్ ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య జరిగింది. 60 ఓవర్ల ఫార్మాట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 60 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 334 పరుగులు చేసింది...

211

డెన్నిస్ అమిస్ 147 బంతుల్లో 18 ఫోర్లతో 137 పరుగులు చేయగా కెత్ ఫ్లెచర్ 68 పరుగులు చేశాడు. క్రిస్ ఓల్డ్ 30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో వన్డే వరల్డ్ కప్ చరిత్రలో మొట్టమొదటి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు...

311

335 పరుగుల భారీ లక్ష్యఛేదనలో టీమిండియా ఓపెనర్ ఏక్‌నాథ్ సోల్కర్ 8 పరుగులు చేసి అవుట్ కాగా అన్షుమన్ గైక్వాడ్ 46 బంతుల్లో 2 ఫోర్లతో 22 పరుగులు చేశాడు. గుండప్ప విశ్వనాథ్ 59 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులు చేశాడు..
 

411

అయితే 174 బంతులు ఆడిన సునీల్ గవాస్కర్, ఒకే ఒక్క ఫోర్ బాది 36 పరుగులు మాత్రమే చేశాడు. 60 ఓవర్ల ఇన్నింగ్స్‌లో సునీల్ గవాస్కర్ ఒక్కడే 29 ఓవర్లు బ్యాటింగ్ చేసినా... చేసింది మాత్రం 36 పరుగులే. వన్డే వరల్డ్ కప్‌లో ఈ జిడ్డు బ్యాటింగ్ చూస్తే... టీమిండియా ఫ్యాన్స్ షాక్ అయ్యారు...

511

గవాస్కర్ ఇన్నింగ్స్ దెబ్బకి 60 ఓవర్లు బ్యాటింగ్ చేసిన టీమిండియా, 3 వికెట్లు కోల్పోయి 132 పరుగులే చేయగలిగింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో 12 మెయిడిన్లు ఉండగా, ప్రతీ ఇంగ్లాండ్ బౌలర్ 3 కంటే తక్కువ ఎకానమీ నమోదు చేశారు...
 

611

సునీల్ గవాస్కర్ కావాలని ఇంత జిడ్డు బ్యాటింగ్ చేశారని టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఇన్నింగ్స్ ఆడకంటే మొదటి బంతికే డకౌట్ అయినా మిగిలిన బ్యాటర్లు అంతో కొంతో కష్టపడి కనీసం 200 అయినా కొట్టివాళ్లేమోనని విమర్శలు వెల్లువెత్తాయి..

711

‘ఆ ఇన్నింగ్స్ గురించి ఇప్పటికీ నేను వివరించలేను. ఆ ఇన్నింగ్స్‌ని ఇప్పుడు చూస్తే నేను ఇన్నింగ్స్ ఆరంభంలో వింత వింత షాట్స్ ఆడేందుకు ప్రయత్నించడాన్ని చూడొచ్చు. అంతకుముందు నేనెప్పుడూ ఆడని షాట్స్, ఆ మ్యాచ్‌లో ప్రయత్నించాను..

811

వన్డే వరల్డ్ కప్‌ మ్యాచ్ ఆడుతున్నా అనే అత్యుత్సాహం కావచ్చు, మరేదో కావచ్చు కానీ మెంటల్‌గా నేను చాలా ఆందోళనకు లోనయ్యా. ఎంత ప్రయత్నించినా పరుగులు చేయలేకపోయా. ..

911

ఇక నా వల్ల కాదని కొన్నిసార్లు వికెట్లకు అడ్డు తప్పుకుని బౌల్డ్ అవ్వాలని కూడా ప్రయత్నించా. అయితే దరిద్రం వెంటాడినట్టు ఎంత ప్రయత్నించినా అవుట్ కాలేకపోయా..

1011

నేను షాట్లు ఆడలేకపోయా, అవుట్ అవ్వలేకపోయా. నేను రెండో బంతికే అవుట్ అవ్వాల్సింది, నేను ఇచ్చిన క్యాచ్‌ని వాళ్లు అందుకున్నా అప్పీలు చేయలేదు. అప్పుడు స్వచ్ఛందంగా వాకోవర్ చేసినా పోయేదని నన్ను నేనే తిట్టుకున్నా, నాటౌట్‌గా మిగిలినందుకు ఇప్పటికీ చాలా చాలా బాధపడుతున్నా.. ఆ ఇన్నింగ్స్, నా కెరీర్‌లో అత్యంత చేదు అనుభవం...’ అంటూ చెప్పుకొచ్చారు సునీల్ గవాస్కర్...

1111

నేను షాట్లు ఆడలేకపోయా, అవుట్ అవ్వలేకపోయా. నేను రెండో బంతికే అవుట్ అవ్వాల్సింది, నేను ఇచ్చిన క్యాచ్‌ని వాళ్లు అందుకున్నా అప్పీలు చేయలేదు. అలా నాటౌట్‌గా మిగిలినందుకు ఇప్పటికీ చాలా చాలా బాధపడుతున్నా.. ఆ ఇన్నింగ్స్, నా కెరీర్‌లో అత్యంత చేదు అనుభవం...’ అంటూ చెప్పుకొచ్చారు సునీల్ గవాస్కర్...

click me!

Recommended Stories