అశ్విన్ దెబ్బకు సగం స్టేడియం ఖాళీ... టాస్ సమయంలో హౌస్ ఫుల్, అంతలోనే...

Published : Jun 07, 2023, 06:52 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ 2023 చూసేందుకు కెన్నింగ్టన్ ఓవల్‌కి టీమిండియా ఫ్యాన్స్ పోటెత్తారు. దీంతో టాస్ సమయానికి ముందే స్టేడియం దాదాపు హౌస్ ఫుల్ అయిపోయింది. అయితే కొద్దిసేపటికే సగం స్టేడియం ఖాళీగా కనిపించింది..

PREV
18
అశ్విన్ దెబ్బకు సగం స్టేడియం ఖాళీ... టాస్ సమయంలో హౌస్ ఫుల్, అంతలోనే...

కెన్నింగ్టన్ ఓవల్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పచ్చికతో ఫాస్ట్ బౌలర్లకు చక్కగా అనుకూలించే పిచ్‌ని రూపొందించింది ఐసీసీ. దీంతో నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఓ స్పిన్నర్‌తో బరిలో దిగాలని నిర్ణయం తీసుకుంది టీమిండియా....
 

28

ఐపీఎల్ 2023 సీజన్‌లో పర్పుల్ క్యాప్ గెలిచిన మహ్మద్ షమీతో పాటు మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్‌లను ఫాస్ట్ బౌలర్లుగా ఎంచుకున్న టీమిండియా... రవీంద్ర జడేజాకి స్పిన్ ఆల్‌రౌండర్‌గా తుది జట్టులో చోటు కల్పించింది.

38
Image credit: Getty

ఐసీసీ వరల్డ్ నెం.1 టెస్టు బౌలర్‌గా, నెం.2 టెస్టు ఆల్‌రౌండర్‌గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్‌కి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చోటు దక్కలేదు. ఇది టీమిండియా ఫ్యాన్స్‌కి ఆశ్చర్యాన్ని కలిగించింది...

48
India Vs Australia, WTC Final

దాదాపు 25 వేల మంది కెపాసిటీ ఉన్న ఈ స్టేడియం, దాదాపు సగానికి పైగా భారత ఫ్యాన్స్‌తో నిండిపోయింది. మొదటి బంతి నుంచి టీమిండియాకి సపోర్ట్ చేస్తూ అరుస్తూ, బౌలర్లను ఉత్సాహపరిచారు అభిమానులు...

58

అయితే రవిచంద్రన్ అశ్విన్‌కి తుది జట్టులో చోటు దక్కలేదని తెలిసిన తర్వాత చాలామంది క్రికెట్ ఫ్యాన్స్, స్టేడియం వదిలి బయటికి వెళ్లిపోవడం కనిపించింది. ఇంగ్లాండ్‌లో జరిగిన ఐసీసీ డబ్ల్యూటీసీ 2021 ఫైనల్‌లో అశ్విన్ 4 వికెట్లు తీశాడు..

68
Image credit: PTI

అంతేకాకుండా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లపై అశ్విన్‌కి తిరుగులేని రికార్డు ఉంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్‌లో టాప్ 7లో నలుగురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే. అయినా అశ్విన్‌కి తుది జట్టులో చోటు కల్పించకపోవడంపై క్రికెట్ పండితులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు...

78

‘రవి అశ్విన్ మాకు మ్యాచ్ విన్నర్. అలాంటి ప్లేయర్‌ని తుది జట్టులోకి తీసుకోకపోవడం మమ్మల్ని బాధపెడుతోంది. అయితే పరిస్థితులకు తగ్గట్టుగా బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ని ఆడించాలని, అశ్విన్‌ని పక్కనబెట్టాల్సి వచ్చింది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..

88

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోలేకపోయిన రవిచంద్రన్ అశ్విన్, వాటర్ బాయ్‌గా మారాడు. డ్రింక్స్ బ్రేక్ సమయంలో క్రీజులోకి వాటర్ బాటిల్స్ తీసుకొచ్చిన అశ్విన్, బౌలర్లకు, కెప్టెన్ రోహిత్ శర్మకు సూచనలు ఇచ్చాడు...
 

Read more Photos on
click me!

Recommended Stories