Published : Mar 29, 2022, 12:57 PM ISTUpdated : Mar 29, 2022, 01:26 PM IST
Virender Sehwag: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రిటైరై సుమారు పదేండ్లు కావల్సి వస్తున్నది. వీరూ రిటైర్ అయినా అతడి రికార్డులు మాత్రం చెక్కు చెదరలేదు. భారత్ తరఫున తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన ఈ నజఫ్గడ్ నవాబ్ కు మార్చి 29తో ప్రత్యేక అనుబంధం ఉంది.
డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు తన క్రికెట్ కెరీర్ లో మార్చి 29తో ప్రత్యేక అనుబంధముంది. ఈరోజేమైనా వీరూ బర్త్ డే అనుకుంటున్నారా..? అస్సలు కాదు. భారత క్రికెట్ లో అప్పటిదాకా అందని ద్రాక్షలా మిగిలపోయిన ట్రిపుల్ సెంచరీని వీరూ సాధించింది ఈరోజే..
210
2004లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన భారత్.. ముల్తాన్ లో టెస్టు ఆడింది. ఈ టెస్టులో వీరూ.. భీకర బౌలింగ్ దాడి ఉన్న పాక్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తూ ముల్తాన్ లో శివతాండవం ఆడాడు.
310
ఈ మ్యాచులో అతడు ట్రిపుల్ సెంచరీ (309) కొట్టి భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. వీరూ ట్రిపుల్ సెంచరీ సాధించింది మార్చి 29నే..
410
ఇదొక్కటే కాదండోయ్, తన రెండో ట్రిపుల్ సెంచరీని కూడా వీరూ ఇదే తారీఖున సాధించాడు. సరిగ్గా నాలుగేండ్ల తర్వాత ఈ నజఫ్గడ్ నవాబ్.. 2008లో భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా కు ట్రిపుల్ రుచి చూపించాడు.
510
చెన్నై లో జరిగిన టెస్టులో వీరూ.. మరో ట్రిపుల్ (319) సాధించాడు. అయితే ఈ రెండు టెస్టులలో మార్చి 29న ట్రిపుల్ సెంచరీలు సాధించిన వీరూ.. ఇదే తేదీన నిష్క్రమించడం గమనార్హం.
610
ఇదిలాఉండగా వీరూ.. తన కార్ నెంబర్ కూడా ‘2903’ కావడం విశేషం. ఇదే విషయమై సెహ్వాగ్ తాజాగా ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘తేదీలో ఏముంది..? మార్చి 29.. నా క్రికెట్ కెరీర్ లో చాలా ప్రత్యేకమైన రోజు.
710
పాకిస్థాన్ తో ముల్తాన్ లో ఇదే తారీఖున తొలి ట్రిపుల్ సెంచరీ కొట్టాను. తర్వాత నాలుగేండ్లకు మళ్లీ ఇదే డేట్ న దక్షిణాఫ్రికాపై ఈ ఫీట్ సాధించాను. యాధృశ్చికంగా నా కార్ నెంబర్ (2903) కావడం నిజంగా నమ్మలేకుండా ఉంది..’ అని ట్వీట్ చేశాడు.
810
వీరూ చెప్పినట్టు అతడి కెరీర్ లో ఎంతో ప్రాముఖ్యమైన ఈ ఘనతలు ఒకే తేదీన జరగడం.. తన కార్ నెంబర్ కూడా అదే తేదీతో కలిసుండటం యాధృశ్చికం కాక మరేంటి..?
910
టెస్టులలో అత్యంత విజయవంతమైన ఓపెనర్ గా గుర్తింపు పొందిన వీరూ.. టెస్టు క్రికెట్ చరిత్రలో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన వారిలో నాలుగో క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్మన్, బ్రియాన్ లారా, క్రిస్ గేల్ అతడికంటే ముందున్నారు.
1010
అయితే వీరూ.. తన కెరీర్ లో మూడో ట్రిపుల్ కూడా సాధించేవాడే. 2010 లో ముంబై టెస్టులో 293 పరుగులు చేసిన సెహ్వాగ్ ను.. శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఔట్ చేశాడు. ఒకవేళ వీరూ గనక ఏడు పరుగులు చేసుంటే టెస్టులలో ట్రిపుల్ ట్రిపుల్ సెంచరీలు సాధించిన తొలి ఆటగాడు అయి ఉండేవాడు.