ఐపీఎల్ 2021 సీజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కి పీడకలను మిగిల్చింది. లీగ్‌లో మూడంటే మూడు మ్యాచుల్లో గెలిచిన ఆరెంజ్ ఆర్మీ, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. దీంతో ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు కెప్టెన్ కేన్ విలియంసన్‌ను ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లను రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. మిగిలిన ప్లేయర్లను వేలానికి వదిలేసింది...
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున గత మూడు సీజన్లలో రూ.11 కోట్లు తీసుకున్న మనీశ్ పాండేని 2022 సీజన్‌లో రూ.4.6 కోట్లకు కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్...
29
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున గత మూడు సీజన్లలో రూ.3.2 కోట్లు తీసుకున్న ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ని గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.1.4 కోట్లకు కొనుగోలు చేసింది...
39
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఈ ఇద్దరు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు, తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థులుగా బరిలో దిగారు. లక్నో సూపర్ జెయింట్స్ తరుపున బరిలో దిగిన మనీశ్ పాండే, మెరుపులు మెరిపించలేకపోయాడు...
49
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫామ్‌ని కంటిన్యూ చేస్తూ 5 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసి మహ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు మనీశ్ పాండే...
59
అలాగే గుజరాత్ టైటాన్స్ తరుపున వన్‌డౌన్ బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్, 6 బంతుల్లో 4 పరుగులు చేసిన దుస్మంత ఛమీరా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
69
అలాగే రూ.15 కోట్లకు గుజరాత్ టైటాన్స్ జట్టుకి వెళ్లిన రషీద్ ఖాన్... 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి ఒకే వికెట్ తీయగలిగాడు. 6.8 ఎకానమీతో బౌలింగ్ చేసినా, రషీద్ మెరుపులు మాత్రం కనిపించలేదు...
79
అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలానికి వదిలేసిన మిచెల్ మార్ష్, జాసన్ రాయ్‌లు గాయం కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే..
89
అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ నుంచి బయటికి వచ్చిన బాసిల్ తంపి, సందీప్ శర్మ నుంచి కూడా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ రాలేదు...
99
ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌కి ముందే మాజీ ప్లేయర్లు పెద్దగా రాణించకపోవడంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కొంత సంతోషిస్తున్నారు. వీళ్లంతా టీమ్‌లో ఉండి ఉంటే, టీమ్ పరిస్థితి గత సీజన్‌లోలాగే ఉండేదని అంటూ ట్రోల్స్ చేస్తున్నారు...