నిన్నటి మ్యాచులో 41 బంతుల్లోనే 54 పరుగులు చేసి తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. అతడి ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు కూడా ఉన్నాయి. ఈ ఇద్దరి అద్భుత బ్యాటింగ్ తో లక్నో ఆ మాత్రం స్కోరైనా సాధించింది. అయితే హార్థిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్ ల నిలకడైన ఆటకు తోడు రాహుల్ తెవాటియా సంచలన ఇన్నింగ్స్ తో గుజరాత్ విజయం సొంతం చేసుకుంది.