IPL: ఫ్యాన్స్ కు బంపరాఫర్ ఇచ్చిన ధోని.. ఎట్టకేలకు అందులోకి అనుమతి.. తక్కువ ధరకే పండ్లు, కూరగాయలు

Published : Mar 18, 2022, 02:44 PM ISTUpdated : Mar 18, 2022, 02:48 PM IST

IPL 2022 Live Updates: అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఐపీఎల్ మినహా మిగిలిన సమయాన్నంతా తన ఫామ్ హౌజ్ లోనే గడుపుతున్నాడు జార్ఖండ్ డైనమైట్ ధోని.. తనకున్న 43 ఎకరాల ఫామ్ హౌజ్ లో... 

PREV
17
IPL: ఫ్యాన్స్ కు బంపరాఫర్ ఇచ్చిన ధోని.. ఎట్టకేలకు అందులోకి  అనుమతి.. తక్కువ ధరకే పండ్లు, కూరగాయలు

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని తన అభిమానులకు  బంపరాఫర్ ఇచ్చాడు. రాంచీలో ఉన్న తన ఫామ్ హౌస్ ను చూడటానికి ప్రజలకు అనుమతినిచ్చాడు.  హోళి సందర్భంగా ధోని ఈ నిర్ణయం తీసుకున్నాడు. 

27

హోళి పర్వదినాన్ని పురస్కరించుకుని జార్ఖండ్ రాజధాని రాంచీకి సమీపంలోని చంబో లో ఉన్న తన ఫామ్ హౌస్ ను సందర్శించడానికి ధోని అనుమతినిచ్చాడు. మార్చి 17 నుంచి మూడు రోజుల పాటు.. ప్రజలు ధోని ఫామ్ హౌస్ ను సందర్శించవచ్చు. 

37

రాంచీకి సమీపంలో ఉన్న చంబోలో ధోనికి 43 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. ఈ సందర్భంగా ధోని.. తన ఫామ్ హోజ్ లో పండించిన కూరగాయలు, పండ్లను కూడా అమ్మకానికి పెట్టాడు. 

47

ధోని తన ఫామ్ హోజ్ లో స్ట్రాబెర్రి,  బొప్పాయి, జామ, ఖర్బూజ, క్యాప్సికం, చేపలు, గోధుమ వంటి పంటలను పండిస్తున్నాడు.  అయితే ఫామ్ హౌజ్  సందర్శనార్థం అక్కడికి వచ్చిన ప్రజలకు రూ. 50 లకే పావుకిలో నాణ్యమైన   స్ట్రాబెర్రీలను అందిస్తున్నారు. 

57

ఇదే విషయమై ధోని వ్యవసాయ కార్యకలాపాలు చూసుకునే  ప్రతినిధి రోషన్ కుమార్ మాట్లాడుతూ.. ‘ధోనికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. తనకు వీలు చిక్కినప్పుడల్లా అతడు ఫామ్ హౌజ్ కు వచ్చి పంటలు ఎలా ఉన్నాయనేది చూసుకుంటాడు. అంతేగాక ఇక్కడ పని  కూడా చేస్తాడు...’ అని చెప్పాడు. 

67

ధోని ఫామ్ హౌజ్ లో కూరగాయలు, పండ్లు, చేపలతో పాటుగా కఢక్నాథ్ కోళ్లను కూడా పెంచుతున్నాడనే వార్తలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా  మారిన విషయం తెలిసిందే.

77

ఇదిలాఉండగా ఈ చెన్నై సూపర్ కింగ్స్ సారథి ప్రస్తుతం తన ఆఖరి సీజన్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు.  సూరత్ లో ప్రాక్టీస్ సెషన్ లో ఉన్న చెన్నై.. ఈనెల 26న మొదలుకాబోయే ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో తొలి మ్యాచ్ ఆడుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories