లక్నో సూపర్ జెయింట్స్‌కి ఊహించని షాక్... గాయంతో స్టార్ బౌలర్ దూరం...

Published : Mar 18, 2022, 01:55 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్‌కి ఊహించని షాక్ తగిలింది. గాయం కారణంగా ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్, ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు...

PREV
110
లక్నో సూపర్ జెయింట్స్‌కి ఊహించని షాక్... గాయంతో స్టార్ బౌలర్ దూరం...

అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్, వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో గాయపడి రెండో టెస్టుకి దూరమయ్యాడు...

210

మోచేతి గాయం కారణంగా వెస్టండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ మొత్తానికి దూరమైన మార్క్ వుడ్, ఐపీఎల్‌ 2022 సీజన్‌కి కూడా దూరం కాబోతున్నాడు... 

310

ఐపీఎల్ 2022 మెగా వేలంలో మార్క్ వుడ్‌ని రూ.7.5 కోట్ల భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్... మార్క్‌ వుడ్‌కి ఇదే మొట్టమొదటి ఐపీఎల్...

410

140-150 కి.మీ.ల వేగంతో నిప్పులు చెరిగే బంతులు వేయడమే కాకుండా అవసరమైతే బ్యాటింగ్‌లో మెరుపులు మెరపించగల మార్క్ వుడ్, లక్నోకి ఆల్‌రౌండర్‌గా ఉపయోగపడతాడని భావించారు టీమ్ మేనేజ్‌మెంట్... 

510

అయితే ఐపీఎల్‌ ఆరంభానికి ముందు గాయపడిన మార్క్ వుడ్, ఈసారి కూడా లీగ్‌లో పాల్గొనలేకపోతున్నాడు. మార్క్ వుడ్‌తో కలిపి ఇప్పటికే ముగ్గురు ఇంగ్లాండ్ ప్లేయర్లు, వేలం తర్వాత ఐపీఎల్‌కి దూరమయ్యారు...

610

గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసిన జాసన్ రాయ్‌తో పాటు కేకేఆర్ ప్లేయర్ ఆలెక్స్ హేల్స్... బయో బబుల్‌లో రెండున్నర నెలలు గడపలేమంటూ ఐపీఎల్ 2022 సీజన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే..

710

జాసన్ రాయ్ స్థానంలో ఆఫ్ఘాన్ యంగ్ బ్యాటర్ రెహ్మనుల్లా గుర్భాజ్‌ను రిప్లేస్‌మెంట్‌గా తీసుకుంది గుజరాత్ టైటాన్స్. ఆలెక్స్ హేల్స్ స్థానంలో ఆసీస్ వైట్ బాల్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, కేకేఆర్ తరుపున ఆడబోతున్నాడు...

810

మార్క్ వుడ్ స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ ఏ బౌలర్‌ను తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. భారత స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్, లక్నోకి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే..

910

గత సీజన్లలో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్‌ను రూ.17 కోట్లు చెల్లించి మరీ, కెప్టెన్‌గా కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్...

1010

కెఎల్ రాహుల్‌తో పాటు మనీశ్ పాండే, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా, ఆవేశ్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మార్కస్ స్టోయినిస్, రవి భిష్ణోయ్, దుస్మంత ఛమీరా వంటి ప్లేయర్లు లక్నో సూపర్ జెయింట్స్‌లో ఉన్నారు. 

click me!

Recommended Stories