మొన్న శార్దూల్‌ని అన్నారు, ఇప్పుడు ఉమేశ్‌ని అంటున్నారు! రేపు కెప్టెన్ రోహిత్ కూడా దండగే అంటారేమో..

Published : Jun 10, 2023, 04:28 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023కి ఎంపిక చేసిన భారత జట్టులో రవిచంద్రన్ అశ్విన్‌కి చోటు ఇవ్వకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది. నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఓ స్పిన్నర్ ఫార్ములాని ఎంచుకున్న టీమిండియా, రవీంద్ర జడేజాని టీమ్‌లోకి తీసుకొచ్చి అశ్విన్‌ని పక్కనబెట్టేసింది..

PREV
17
మొన్న శార్దూల్‌ని అన్నారు, ఇప్పుడు ఉమేశ్‌ని అంటున్నారు! రేపు కెప్టెన్ రోహిత్ కూడా దండగే అంటారేమో..
Shardul Thakur

ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 1లో ఉన్న రవిచంద్రన్ అశ్విన్, ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో నెం.2లో ఉన్నాడు. అయినా అతన్ని పట్టించుకోని టీమిండియా, ఐపీఎల్ 2023 సీజన్‌లో ఫ్లాప్ అయిన ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్‌లను తుది జట్టులోకి తీసుకొచ్చింది...

27

ఐపీఎల్ 2023 సీజన్‌లో 11 మ్యాచుల్లో కలిపి 21 ఓవర్లే బౌలింగ్ చేసిన శార్దూల్ ఠాకూర్ రెండే వికెట్లు తీశాడు. అయినా శార్దూల్ ఠాకూర్‌కి తుది జట్టులో చోటు ఇవ్వడంపై ట్రోల్స్ వచ్చాయి.. 
 

37
Shardul Thakur

తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్, బ్యాటింగ్‌లో అజింకా రహానేతో కలిసి 109 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పి, టీమిండియాని ఆదుకున్నాడు...

47
Umesh Yadav


దీంతో ఇప్పుడు ఉమేశ్ యాదవ్‌ ఎంపికని ట్రోల్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన ఏకైక బౌలర్ ఉమేశ్ యాదవే...

57

‘శార్దూల్ ఠాకూర్‌ని ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌కి ఎంపిక చేయడంపై జనాలు మొదటి రోజు బాగా తిట్టారు.  ఇప్పుడు మూడో రోజున ఉమేశ్ యాదవ్ సెలక్షన్ గురించి తిడుతున్నారు.. ఇది ఎక్కడికి వెళ్తుందో...’ అంటూ ట్వీట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...

67

‘రోహిత్ శర్మ టీమ్‌లో ఉండడం కూడా దండగే. అతని వల్ల టీమిండియాకి ఒరిగిందేమీ లేదు... ముందు అతన్ని తప్పించాలి..’ అంటూ ఆకాశ్ చోప్రా ట్వీట్‌పై టీమిండియా ఫ్యాన్స్ చాలామంది కామెంట్లు పెడుతుండడం విశేషం..

77
Image credit: PTI

తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ తీయలేకపోయిన ఉమేశ్ యాదవ్, రెండో ఇన్నింగ్స్‌లో 2 కీలక వికెట్లు తీశాడు. ఉస్మాన్ ఖవాజాతో పాటు మార్నస్ లబుషేన్ వికెట్ తీసిన ఉమేశ్ యాదవ్... మూడో ఇన్నింగ్స్‌లో చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. 
 

click me!

Recommended Stories