ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023లో టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. భారీ అంచనాలు పెట్టుకున్న వాళ్లు చేతులు ఎత్తేసినా 17 నెలల తర్వాత టీమ్‌లోకి వచ్చిన అజింకా రహానే ఆపద్భాంధవుడిలా మారాడు...
ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన అజింకా రహానే, రవీంద్ర జడేజాతో కలిసి 50+ భాగస్వామ్యం, శార్దూల్ ఠాకూర్‌తో కలిసి 109 భాగస్వామ్యం జోడించి టీమిండియాని ఆదుకున్నాడు...
26
శార్దూల్ ఠాకూర్‌తో పాటు అజింకా రహానేని టార్గెట్ చేస్తూ బౌన్సర్లు వేశారు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు. వికెట్లకు అడ్డుగా నిలబడిన శార్దూల్ ఠాకూర్ చాలాసార్లు గాయపడినా మొండిగా బ్యాటింగ్ కొనసాగించాడు.
36
ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో ఓ బౌన్సర్, అజింకా రహానే కుడి చేతికి బలంగా తాకింది. ఈ దెబ్బకు వేలు చిట్లినా అజింకా రహానే ఫిజియో చికిత్స తర్వాత తిరిగి బ్యాటింగ్ కొనసాగించాడు. తాజాగా అజింకా రహానే గాయం గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది ఆయన భార్య రాధికా..
46
Rahane Batting
‘నీ వేలు వాచిపోయినా నువ్వు స్కానింగ్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. బ్యాటింగ్‌పై ఫోకస్ దెబ్బకుండా, మైండ్‌సెట్ మారకుండా ఉండేందుకు ఇప్పుడు స్కానింగ్ చేయించుకోకూడదని నిర్ణయం తీసుకున్నావ్..
56
నిస్వార్థంగా, పట్టువదలకుండా నీ మొండితనాన్ని చూపించావు. నీ ఈ అచంచలమైన కమిట్‌మెంట్, ఎందరికో ఆదర్శప్రాయం. నీ సహనం, నీ ఓపిక... నిన్నెప్పుడూ అనంతంగా ప్రేమిస్తూనే ఉంటా...’ అంటూ సుదీర్ఘమైన పోస్ట్ చేసింది అజింకా రహానే భార్య రాధికా...
66
Ajinkya Rahane
అజింకా రహానే 89, శార్దూల్ ఠాకూర్ 51, రవీంద్ర జడేజా 48 పరుగులు చేసి ఆదుకోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకి ఆలౌట్ అయ్యింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసిన ఆస్ట్రేలియాకి 173 పరుగుల ఆధిక్యం దక్కింది.