హైదరాబాద్‌లో మూడే, అందులో 2 పాకిస్తాన్‌వే! భాగ్యనగరంలో వరల్డ్ కప్ మ్యాచులు పెట్టకపోవడానికి కారణం ఇదే...

Published : Jun 27, 2023, 02:13 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్‌ విడుదలైంది. మనవాళ్ల పర్ఫామెన్స్ ఎలా ఉన్నా, స్టేడియానికి తండోప తండాలుగా వెళ్లి ఐపీఎల్ మ్యాచులను ఎంజాయ్ చేసిన హైదరాబాదీలకు వన్డే వరల్డ్ కప్ విషయంలో అన్యాయమే జరిగింది..

PREV
18
హైదరాబాద్‌లో మూడే, అందులో 2 పాకిస్తాన్‌వే! భాగ్యనగరంలో వరల్డ్ కప్ మ్యాచులు పెట్టకపోవడానికి కారణం ఇదే...

2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో హైదరాబాద్‌, ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మూడు మ్యాచులు మాత్రమే జరుగుతున్నాయి. అందులో రెండు మ్యాచులు పాకిస్తాన్, క్వాలిఫైయర్ టీమ్స్‌తో ఆడుతుంటే మరో మ్యాచ్ న్యూజిలాండ్, క్వాలిఫైయర్ 1 టీమ్ మధ్య జరగనుంది...

28

భారత క్రికెట్ టీమ్ మాత్రం హైదరాబాద్‌లోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడబోవడం లేదు. చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, పూణే, ధర్మశాల, లక్నో, ముంబై, కోల్‌కత్తా, బెంగళూరు వేదికల్లో లీగ్ మ్యాచులు ఆడబోతున్న టీమిండియా, భాగ్యనగరంలో మాత్రం ఒక్క వరల్డ్ కప్ మ్యాచ్ కూడా ఆడడం లేదు. 

38

2021 టీ20 వరల్డ్ కప్‌కి ముందుగా విడుదల చేసిన షెడ్యూల్‌లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కి భాగ్యనగరమే వేదిక ఇవ్వాల్సింది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ, ఇండియా నుంచి యూఏఈకి మారడంతో హైదరాబాద్ జనాలకు దాయాదుల సమరం చూసే అవకాశం మిస్ అయ్యింది...

48

ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచుల నిర్వహణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అట్టర్ ఫ్లాప్ కావడమే, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియాకి సంబంధించిన ఒక్క మ్యాచ్ కూడా ఇక్కడ నిర్వహించకూడదనే నిర్ణయం తీసుకోవడానికి కారణమని వార్తలు వినిపించాయి..

58

అయితే అసలు కారణం అది కాదు. 2023 ఆఖర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 2018లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్‌ఎస్ (ఇప్పుడు బీఆర్‌ఎస్) రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే..

68

2023 డిసెంబర్‌లో లేదా అంతకంటే ముందే తెలంగాణ ఎన్నికలకు శంఖం మోగొచ్చు. ఇదే జరిగితే అక్టోబర్- నవంబర్ మాసాల్లో తెలంగాణ రాష్ట్రమంతటా ఎన్నికల ప్రచారం సాగుతుంది. ఈ సమయంలో హైదరాబాద్‌లో మ్యాచులు నిర్వహించడం జరగని పని..

78

ఎన్నికలు, ప్రచార బందోబస్తు పనుల్లో పోలీసులందరూ మహా బిజీగా ఉంటారు. ఈ టైమ్‌లో ఇండియా మ్యాచ్ పెడితే అక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లు చేయడం చాలా కష్టమైపోతుంది. ఈ విషయాన్ని హెచ్‌సీఏ, బీసీసీఐ వెల్లడించడం వల్లే హైదరాబాద్‌లో మూడు వరల్డ్ కప్ మ్యాచులే నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు..

88

పాకిస్తాన్‌ మ్యాచులు చూసేందుకు హైదరాబాద్‌లో ఓ వర్గం స్టేడియానికి వెళ్లినా, మరీ భారీగా పోలీసులను మోహరించాల్సిన అవసరమైతే ఉండదు. అందుకే వన్డే వరల్డ్ కప్‌లో 3 మ్యాచులు హైదరాబాద్‌లో జరగబోతున్నాయి.. 

click me!

Recommended Stories