WI vs IND: మెక్‌కాయ్ సంచలన స్పెల్.. రికార్డులు తిరగరాసిన విండీస్ పేసర్

Published : Aug 02, 2022, 11:31 AM IST

WI vs IND T20I: వెస్టిండీస్-ఇండియా మధ్య  సోమవారం ముగిసిన రెండో టీ20లో భారత జట్టును ముప్పుతిప్పలు పెట్టిన విండీస్ పేసర్ ఒబెడ్ మెక్‌కాయ్ తన కెరీర్ లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదుచేశాడు.   

PREV
16
WI vs IND: మెక్‌కాయ్ సంచలన స్పెల్.. రికార్డులు తిరగరాసిన విండీస్ పేసర్

విండీస్ పర్యటనలో భారత్ కు ఊహించిన షాక్ ఇస్తూ ఆ జట్టు  పేసర్ ఒబెడ్ మెక్‌కాయ్  సంచలన స్పెల్ వేశాడు. సోమవారం  సెయింట్ కిట్స్ లోని  వార్నర్ పార్క్ లో విండీస్-ఇండియా మధ్య జరిగిన రెండో టీ20లో ఈ విండీస్ పేసర్.. నాలుగు ఓవర్లు వేసి 17 పరుగులే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక మెయిడిన్ కూడా ఉండటం గమనార్హం. 

26

మెక్‌కాయ్ దాటికి భారత బ్యాటర్లు క్రీజులో నిలవడానికే ఇబ్బందిపడ్డారు.  కెప్టెన్ రోహిత్ శర్మ (0) తో పాటు సూర్యకుమార్ యాదవ్ (11), రవీంద్ర జడేజా (27), దినేశ్ కార్తీక్ (7), అశ్విన్ (10), భువనేశ్వర్ (1) లు మెక్‌కాయ్ బౌలింగ్ కు బలయ్యారు. 

36

మెక్‌కాయ్ కు తోడుగా జేసన్ హోల్డర్ (2 వికెట్లు),  అకీల్ హోసెన్, అల్జారీ జోసెఫ్ లు తలో వికెట్ తో చెలరేగడంతో భారత్.. 19.4 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. 
 

46

అయితే ఈ ప్రదర్శనతో మెక్‌కాయ్  పలు రికార్డులు తన పేరిట నమోదు చేసుకున్నాడు. టీ20 ఫార్మాట్ లో  ఒక ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీసిన ఐదో బౌలర్ గా మెక్‌కాయ్  రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ జాబితాలో దీపక్ చహర్ (బంగ్లాదేశ్ పై 6-7), అజంతా మెండిస్ (జింబాబ్వేపై 6-8, ఆసీస్ పై 6-16), యుజ్వేంద్ర చాహల్ (ఇంగ్లాండ్ పై 6-25), ఆస్టన్ అగర్ (న్యూజిలాండ్ పై 6-30) ఉన్నారు. 

56

వెస్టిండీస్ తరఫున  బౌలింగ్ లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్ (టీ20లలో) మెక్‌కాయ్  కావడం విశేషం.  అంతకుముందు కీమో పాల్ (5-15), డారెన్ సామి (5-26), జేసన్ హెల్డర్ (5-27) లు ఉన్నారు. 
 

66

ఇక భారత్ పై సంచలన బౌలింగ్ తో అదరగొట్టిన  మెక్‌కాయ్.. టీమిండియాపై టీ20లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తొలి బౌలర్ గా నిలిచాడు. నిన్నటి మ్యాచ్ లో అతడు 6-17 తో చెలరేగగా.. గతంలో వనిందు హసరంగ (4-9), మిచెల్ సాంట్నర్ (4-11), డారెన్ సామి (4-16) లు ఉన్నారు.
 

click me!

Recommended Stories