రేపు మూడో టీ20! మూడు గంటలు ఆలస్యంగా రెండో టీ20... వెస్టిండీస్ బోర్డు నిర్వాకంపై ట్రోల్స్...

Published : Aug 01, 2022, 10:46 PM IST

ఇండియా, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 ఎట్టకేలకు మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్, 3 గంటలు ఆలస్యంగా రాత్రి 11 గంటలకు ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది...

PREV
16
రేపు మూడో టీ20! మూడు గంటలు ఆలస్యంగా రెండో టీ20... వెస్టిండీస్ బోర్డు నిర్వాకంపై ట్రోల్స్...

ట్రిడినాడ్ నుంచి రావాల్సిన భారత ప్లేయర్ల కిట్స్ రాక ఆలస్యం కావడంతో షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2:30లకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు) రెండో టీ20 ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ట్రిడినాడ్ నుంచి సెయింట్ కిట్స్‌కి రావాల్సిన భారత ఆటగాళ్ల కిట్స్‌ రాక ఆలస్యమైంది...

26

దీంతో కిట్ వచ్చేందుకు రెండు గంటల సమయం పడుతుందని సాయంత్రం 4:30లకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు) మ్యాచ్ ప్రారంభం కానుందని వార్తలు వచ్చాయి. అయితే మరో గంట ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది... 

36

షెడ్యూల్ ప్రకారం రేపు, ఆగస్టు 2న ఇరు జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగాల్సి ఉంది. అంటే 3 గంటలు ఆలస్యంగా రెండో టీ20 ముగిసిన తర్వాత 24 గంటల బ్రేక్ కూడా లేకుండా మూడో టీ20 మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది...
 

46

కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) మ్యాచుల నిర్వహణ విషయంలో ఎంతో పకడ్భందీగా ఉండే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు, అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్రమైన ట్రోల్స్ రావడానికి కారణమవుతోంది...

56

అసలే అర్ధరాత్రి మ్యాచులు జరుగుతుండడంతో వెస్టిండీస్, భారత్ మ్యాచులకు సరైన రెస్పాన్స్ రావడం లేదు... ఇలా షెడ్యూల్‌కి ప్రారంభం కాకపోతే ఆ మ్యాచులకు వచ్చే కనీస వ్యూయర్‌షిప్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.. 
 

66

సెయింట్స్ కిట్స్‌లో రెండో, మూడో టీ20 మ్యాచులను ఆడే భారత్, వెస్టిండీస్ జట్లు... ఆ తర్వాత ఆఖరి రెండు టీ20 మ్యాచులను యూఎస్‌ఏలోని ఫ్లోరిడా వేదికగా ఆడబోతున్నాయి. అయితే ఈ మ్యాచుల కోసం అమెరికా చేరేందుకు ఇరు జట్ల ఆటగాళ్లకు ఇంకా వీసా అనుమతులు రావాల్సి ఉందని సమాచారం... 

click me!

Recommended Stories