ఫిట్‌నెస్ లేదని పట్టించుకోని సెలక్టర్లు... ఆ పని చూసుకుంటానంటూ పృథ్వీ షా పోస్ట్...

Published : Aug 01, 2022, 09:41 PM IST

సక్సెస్‌‌ఫుల్ ప్లేయర్ అని నిరూపించుకోవడానికి కొన్ని సార్లు 100 మ్యాచులు ఆడినా సరిపోకపోవచ్చు. అదే ఫెయిల్యూర్‌గా ముద్ర పడడానికి  ఒకే ఒక్క మ్యాచ్ చాలు.  వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత భారత జట్టు తరుపున త్రిబుల్ సెంచరీ చేసిన కరణ్ నాయర్, టీమ్‌లో చోటు కోల్పోవడానికి పెద్ద సమయమేమీ పట్టలేదు... ఇప్పుడు యంగ్ సెన్సేషనల్ బ్యాటర్ పృథ్వీ షా పొజిషన్ కూడా ఇదే...

PREV
19
ఫిట్‌నెస్ లేదని పట్టించుకోని సెలక్టర్లు... ఆ పని చూసుకుంటానంటూ పృథ్వీ షా పోస్ట్...

ఆరంగ్రేటం టెస్టులోనే సెంచరీ చేసి, వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ స్టైల్, సచిన్ టెండూల్కర్ హైట్, బ్రియాన్ లారా టెక్నిక్ కలగలిపిన ఆటగాడిగా పొగడ్తలు దక్కించుకున్న పృథ్వీషా... ఆడిలైడ్ టెస్టు పరాజయం తర్వాత టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోతున్నాడు...
 

29

ఆడిలైడ్ టెస్టుకి ముందు టీమిండియా తరుపున 3 టెస్టుల్లో 335 పరుగులు చేసిన పృథ్వీషా... ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. అయితే ఆడిలైడ్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 4 పరుగులే చేసిన పృథ్వీ షా... ఆ తర్వాత భారత జట్టు మూడు టెస్టులు ఆడినా తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...

39

మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, హనుమ విహారి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా వంటి ప్లేయర్లందరూ గాయం కారణంగా తప్పుకున్నా బ్రిస్బేన్‌లో జరిగిన నాలుగో టెస్టులో పృథ్వీ షాకి తుదిజట్టులో చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగించింది...

49
Prithvi Shaw

2021లో శ్రీలంకలో పర్యటించిన భారత బీ జట్టులో చోటు దక్కించుకున్న పృథ్వీ షా, కరోనా కారణంగా మొదటి టీ20 తర్వాత జట్టుకి దూరమయ్యాడు. తాజాగా జింబాబ్వేతో జరగబోయే సిరీస్‌కి ప్రకటించిన జట్టులోనూ పృథ్వీషాకి చోటు దక్కలేదు..

59

రోహిత్ శర్మ, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా వంటి సీనియర్ ప్లేయర్లందరికీ రెస్ట్ ఇచ్చిన బీసీసీఐ, లిస్టు ఏ క్రికెట్‌లో ఘనమైన రికార్డు ఉన్న పృథ్వీషాని పట్టించుకోలేదు...

69

లిస్టు ఏ క్రికెట్‌లో 44 మ్యాచులు ఆడిన పృథ్వీ షా, 8 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలతో 2316 పరుగులు చేశాడు. సగటు 56 కాగా స్ట్రైయిక్ రేటు 125గా ఉంది. అయినా పృథ్వీ షాని పట్టించుకోలేదు సెలక్టర్లు...

79

పృథ్వీ షాని పట్టించుకోకపోవడానికి అతని ఫిట్‌నెస్‌ కారణమని తెలుస్తోంది. ఐపీఎల్ 2022 టోర్నీకి ముందు భారత ఆటగాళ్లకు నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షల్లో పృథ్వీ షా ఫెయిల్ అయ్యాడు. అయితే అతన్ని భారత జట్టుకి పరిగణించిన బీసీసీఐ, ఐపీఎల్ ఆడనిచ్చింది...
 

89
Prithvi Shaw

భారత జట్టుకి ఆడాలంటే మాత్రం ఫిట్‌నెస్ సాధించి, యోయో టెస్టులో పాస్ కావాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ 22 ఏళ్ల చిన్నోడు ఇప్పుడు ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాడట...

99

గత నెలలో మాల్దీవుల్లో వెకేషన్‌కి వెళ్లిన పృథ్వీ షా, స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత జిమ్‌లో ట్రైయినింగ్ మొదలెట్టాడు. తాజాగా.. ‘వెళ్లి పని మొదలెడదాం...’ అంటూ కాప్షన్‌లో జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు పృథ్వీ షా... 

click me!

Recommended Stories