అందరూ అన్ని పనులు చేయలేరు.. గంగూలీ నిష్క్రమణపై రవిశాస్త్రి కామెంట్స్..

Published : Oct 14, 2022, 10:24 AM IST

BCCI Elections: బీసీసీఐ అధ్యక్ష స్థానం నుంచి సౌరవ్ గంగూలీ తప్పుకుంటున్న  విషయం తెలిసిందే. ఈనెల 18న ఆయన.. రోజర్ బిన్నీకి బాధ్యతలు అప్పజెప్తాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

PREV
16
అందరూ అన్ని పనులు చేయలేరు.. గంగూలీ నిష్క్రమణపై రవిశాస్త్రి కామెంట్స్..

టీమిండియా ఆటతో పాటు బీసీసీఐ వ్యవహారాలపై తనదైన శైలిలో వ్యాఖ్యానించే భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి  మరోసారి  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరో నాలుగు రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి  వెళ్లిపోతున్న  సౌరవ్ గంగూలీ, కొత్త అధ్యక్షుడు (?) రోజర్ బిన్నీపైనా మాట్లాడాడు. 

26

ముంబై ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో శాస్త్రి మాట్లాడుతూ.. ‘బీసీసీఐ అధ్యక్షుడి రేసులో  రోజర్ బిన్నీ పేరు ఉన్నందుకు సంతోషంగా ఉంది. నేను అతడితో కలిసి ఆడాను.  1983 వన్డే ప్రపంచకప్ బిన్నీ నా సహచర ఆటగాడు. కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఇప్పుడు బీసీసీఐకి వస్తున్నాడు. 

36

ఒక ప్రపంచకప్ విన్నింగ్ జట్టులోని సభ్యుడు  బీసీసీఐ అధ్యక్షుడవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు తెలిసి  బీసీసీఐ అధ్యక్ష పదవిలో  ప్రపంచకప్  విజేత కూర్చోనుండటం ఇదే మొదటిసారి అనుకుంటా.. 

46

బిన్నీ రాకతో అయినా దేశవాళీ క్రికెట్ లో వసతులు మెరుగుపడతాయని నేను భావిస్తున్నా. ఎందుకంటే బిన్నీ కూడా ఒక క్రికెటరే.  అతడు కచ్చితంగా  బోర్డులో ఇతర వ్యవహారాల కంటే క్రికెట్ గురించే ఎక్కువ ఆలోచిస్తాడని నేను భావిస్తున్నా.  కింది స్థాయిలో గ్రౌండ్స్ లో  వసతులు సరిగా లేవు. కొత్త పాలకవర్గం దాని మీద దృష్టి సారించాలి..’ అని  చెప్పాడు. 

56

ఇక బీసీసీఐకి రెండోసారి అధ్యక్షుడి కావాలని చూసి భంగపడ్డ గంగూలీని పరోక్షంగా ఉద్దేశిస్తూ శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను మీడియాలో చదివినదాని ప్రకారం బీసీసీఐకి  ఎవరూ రెండోసారి అధ్యక్షుడు కాలేదు. దాని ప్రకారం  చూస్తే ఒకరు రావాలంటే ప్రస్తుతం ఉన్నవారు వెళ్లాల్సిందే. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. మీరు కొన్ని పనులను మాత్రమే చేయగలరు..’ అని తెలిపాడు. 

66

తాను ఇవాళ ఒకపని చేస్తున్నానంటే మూడేండ్ల తర్వాత కూడా ఇదే పని  మూడేండ్ల తర్వాత కూడా చేస్తాననడం భావ్యం కాదు. కొత్త వాళ్లు రావాలి. అదే ఆరోగ్యకరంగా ఉంటుంది అంటూ వ్యాఖ్యానించాడు. గంగూలీ - శాస్త్రి మధ్య విభేదాలు ఉన్న విషయం బహిర్గతమే.  తన కంటే జూనియర్ అయిన గంగూలీ ముందు టీమిండియా హెడ్ కోచ్ గా ఇంటర్వ్యూకు వెళ్లడానికి తనకు మనసొప్పలేదని శాస్త్రి గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతేగాక బీసీసీఐ తీసుకొచ్చిన కొన్ని పాలనాపరమైన  నిర్ణయాల్లో కూడా శాస్త్రి తీవ్రంగా విమర్శించాడు. 

click me!

Recommended Stories