శ్రేయాస్ అయ్యర్‌కి షాక్ ఇచ్చిన బీసీసీఐ... టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ రిజర్వు నుంచి కూడా అవుట్...

Published : Oct 13, 2022, 06:42 PM IST

సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు శ్రేయాస్ అయ్యర్. 3 వన్డేల్లో 191 సగటుతో 191 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. అయినా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టు నుంచి శ్రేయాస్ అయ్యర్‌ని తప్పించింది బీసీసీఐ...

PREV
16
శ్రేయాస్ అయ్యర్‌కి షాక్ ఇచ్చిన బీసీసీఐ... టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ రిజర్వు నుంచి కూడా అవుట్...
Image credit: Getty

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి రిజర్వు ప్లేయర్లుగా ఎంపికైన మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నారు. గాయం కారణంగా దీపక్ చాహార్ ఇక్కడే ఉండిపోగా అతని ప్లేస్‌లో శార్ధూల్ ఠాకూర్, ఆస్ట్రేలియా విమానం ఎక్కబోతున్నాడు...

26
Sanju Samson-Shreyas Iyer

ఇప్పటికే షమీతో పాటు మిగిలిన ప్లేయర్లు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకోగా శ్రేయాస్ అయ్యర్, రవి భిష్ణోయ్ మాత్రం ఇక్కడే ఉండిపోయారు. దీపక్ హుడా కూడా ఫిట్‌నెస్ సాధించడంతో అదనపు బ్యాటర్ అవసరం లేకుండా పోయింది. గాయపడిన జస్ప్రిత్ బుమ్రా ప్లేస్‌లో మహ్మద్ సిరాజ్‌తో పాటు ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్‌లను కూడా ఆస్ట్రేలియాకి పంపించింది బీసీసీఐ...

36

దీంతో భారత బృందంలో ప్లేయర్ల సంఖ్య పరిమితికి మించి పెరిగిపోయింది. ఈ కారణంగానే శ్రేయాస్ అయ్యర్, రవి భిష్ణోయ్‌లను ఇక్కడే ఉండి, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో పాల్గొనాల్సిందిగా బీసీసీఐ ఆదేశాలు పంపినట్టు సమాచారం...

46
Image credit: PTI

శ్రేయాస్ అయ్యర్‌ షార్ట్ బాల్‌ ఆడడానికి ఇబ్బంది పడతాడు. కెరీర్ ఆరంభం నుంచి ఈ సమస్య ఉన్నా ఇంగ్లాండ్‌లో జరిగిన ఐదో టెస్టులో అయ్యర్ అవుటైన విధానం తీవ్ర విమర్శలు రావడానికి కారణమైంది...

56
Image credit: PTI

ఆస్ట్రేలియాలో పిచ్‌లు కూడా బౌన్సీ బౌలింగ్‌కి చక్కగా అనుకూలిస్తాయి. ఈ పిచ్‌లపైన శ్రేయాస్ అయ్యర్ రాణించడం కష్టమని భావించిన బీసీసీఐ, అతన్ని ఇక్కడే ఉండిపోవడమే బెటర్ అని చెప్పి ఉండొచ్చు. గత ఏడాది ఫిబ్రవరిలో గాయపడి, దాదాపు ఆరునెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కి దూరమయ్యాడు శ్రేయాస్ అయ్యర్...
 

66
Image credit: PTI

అంతకుముందు టీమిండియాకి తర్వాతి సారథిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ ఎంట్రీతో తుది జట్టులో చోటు కోసం ఎవరో ఒకరు గాయపడేదాకా ఎదురుచూడాల్సిన పరిస్థితికి చేరుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలోనూ రిజర్వు ప్లేయర్‌గా ఆడిన అయ్యర్‌, ఈసారి ఆ అవకాశం కూడా కోల్పోవడం విశేషం...

click me!

Recommended Stories