విరాట్ కోహ్లీ కాదు, రోహిత్ శర్మ కాదు - అత్యంత విలువైన భారత క్రికెటర్ ఎవరో తెలుసా?

First Published | Sep 15, 2024, 11:42 PM IST

Most Valuable Indian Cricketer : భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీ కాదు, రోహిత్ శర్మను కాదని అశ్విన్ భారత్ క్రికెట్ లో అత్యంత విలువైన క్రికెటర్ గా మరో ప్లేయర్ ను పేర్కొన్నాడు. ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ అవుతోంది. అసలు ఏం జరిగింది?    

ప్రపంచ నెం.1 టెస్టు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కు బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు సిరీస్ కు భారత జట్టులో చోటు దక్కింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్టు సెప్టెంబర్ 19 నుంచి జరగనుంది. స్వదేశంలో సిరీస్ ఆరంభానికి ముందు 37 ఏళ్ల అశ్విన్ 100 టెస్టులు ఆడి 517 వికెట్లు పడగొట్టి అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు.

Most Valuable Indian Cricketer

ఈ క్రమంలోనే 30 ఏళ్ల జస్ప్రీత్ బుమ్రాపై అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆయనను ఎంతో విలువైన వ్యక్తిగా అభివర్ణించారు.  విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజ బ్యాటర్లను కాదని భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను అత్యంత విలుబైన భారత క్రికెటర్ గా పేర్కొన్నాడు. 

బ్యాట్స్ మెన్ల రికార్డులతో సెలబ్రేట్ చేసుకునే దేశంలో బుమ్రాను ఛాంపియన్ గా పేర్కొంటూ సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉందని అశ్విన్ తెలిపాడు. బుమ్రాను ఛాంపియన్ గా పరిగణించాలని 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన అశ్విన్ అన్నాడు.

2016లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో ఫార్మాట్‌లలో అత్యంత ప్రభావవంతమైన బౌలర్‌గా మారాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ 195 మ్యాచ్‌ల్లో 397 వికెట్లు తీశాడు.


తన యూట్యూబ్ ఛానెల్‌లో జర్నలిస్ట్ విమల్ కుమార్‌తో అశ్విన్ మాట్లాడుతూ.. భారతదేశం ఎప్పుడూ బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చెలాయించే దేశం. కానీ, నేను బుమ్రా వేడుకలను ఆనందిస్తున్నాను. బుమ్రా ఒక తరం బౌలర్. చెన్నై వాసులుగా మేము బౌలర్లను చాలా ఆరాధిస్తాం. కొద్ది రోజుల క్రితం బుమ్రా ఓ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా చెన్నై వచ్చారని' చెప్పారు. అలాగే,

అలాగే, 'మేం చెన్నై వాసులు బౌలర్లను బాగా ఆదరిస్తాం. బుమ్రాను చాంపియన్‌గా పరిగణించాలి. బుమ్రా ఇప్పుడు అత్యంత విలువైన భారత క్రికెటర్' అని అశ్విన్ పేర్కొన్నాడు. కాగా,  గాయం కారణంగా బుమ్రా 2022 టీ20 ప్రపంచకప్, 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు దూరమయ్యాడు. గతేడాది గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు.

2023 వన్డే క్రికెట్ వరల్డ్ కప్ లో 11 మ్యాచ్‌లు ఆడి 20 వికెట్లు పడగొట్టాడు. 2024 ప్రారంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బుమ్రా 19 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌తో జరిగిన 2వ టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన బుమ్రా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 ర్యాంక్‌ను అందుకున్నాడు.

ఇంగ్లండ్ సిరీస్ ముగిసిన దాదాపు 8 నెలల తర్వాత భారత్ టెస్టు సిరీస్ లో పాల్గొంటోంది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో భారత్ 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ టోర్నీకి భారత జట్టును బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. 

Most Valuable Indian Cricketer

ఈ జట్టులో బుమ్రా కూడా ఉన్నాడు. బుమ్రా చివరిసారిగా టీ20 ప్రపంచకప్ సిరీస్‌లో 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా తన అత్యుత్తమ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.

బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే ఎంఏ చిదంబరం స్టేడియంలో తమ శిక్షణా సెషన్‌లను ప్రారంభించింది. బుమ్రా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో శిక్షణా సెషన్ నుండి కొన్ని చిత్రాలను పోస్ట్ చేశాడు. అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి. 

Latest Videos

click me!