కోహ్లీ కాదు.. సచిన్ టెండూల్క‌ర్ కంటే ఎక్కువ ప‌రుగులు, సెంచ‌రీలు చేసిన ఆ ముగ్గురు ఎవరో తెలుసా?

First Published Sep 25, 2024, 10:34 AM IST

Unique Cricket Records: అంతర్జాతీయ క్రికెట్ లో స‌చిన్ టెండూల్క‌ర్ అనేక రికార్డులు సృష్టించారు. అత్య‌ధిక ప‌రుగులు, అత్య‌ధిక సెంచ‌రీలు, అత్య‌ధిక మ్యాచ్ లు ఇలా చాలానే ఉన్నాయి. అయితే, స‌చిన్ కంటే ఎక్కువ ప‌రుగులు, సెంచ‌రీలు చేసిన భార‌త ప్లేయ‌ర్లు కూడా ఉన్నారు. ఆ ఆస‌క్తిక‌ర వివ‌రాలు మీకోసం.

Sachin Tendulkar

Unique Cricket Records: స‌చిన్ టెండూల్క‌ర్.. గాడ్ ఆఫ్ క్రికెట్ గా గుర్తింపు పొందిన లెజెండ‌రీ ప్లేయ‌ర్. క్రికెట్ ఉన్న‌న్ని రోజులు స‌చిన్ పేరు నిలిచి ఉంటుంది. మనం అంతర్జాతీయ క్రికెట్ రికార్డు పుస్తకాన్ని తెరిచి చూస్తే అందులో ఎక్కువ ఘ‌న‌త‌లు క‌నిపించే పేరు స‌చిన్ టెండూల్క‌ర్. ఎంతో మంది అత‌న్ని స్ఫూర్తిగా, ఆద‌ర్శంగా తీసుకుని క్రికెట్ లోకి అడుగుపెట్టారు. 

Virat Kohli,Sachin Tendulkar

ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌లో మాస్టర్ బ్లాస్టర్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది. ఇప్పుటికీ స‌చిన్ టెండూల్క‌ర్ కు ఉన్న క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. భార‌త్ లో మ్యాచ్ లు జ‌రిగిన ప్ర‌తిచోటా స‌చిన్ స‌చిన్ అంటూ ఒక్క‌సారైనా స్టేడియం హోరెత్తుతుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక‌ పరుగులు, సెంచరీల విషయంలో సచిన్‌కు దగ్గరగా మ‌రో ప్లేయ‌ర్ లేడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ప్ర‌స్తుతం స‌చిన్ సాధించిన అత్య‌ధిక సెంచ‌రీల (100) రికార్డుకు ద‌గ్గ‌ర‌గా క‌నిపించే ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ (80 సెంచ‌రీలు) కానీ, ఇంకా 20 సెంచ‌రీల దూరం అంటే అంత తేలికైన విష‌యం కాదు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ పేరు అనేక రికార్డులలో అగ్రస్థానంలో ఉంది. కానీ, దేశ‌వాళీ క్రికెట్‌లోభారతదేశపు ముగ్గురు స్టార్ బ్యాట్స్‌మెన్ సచిన్ కంటే చాలా ముందున్నారు. కానీ, భార‌త్ త‌ర‌ఫున వారికి అవ‌కాశాలు రాలేదు. వారి వివ‌రాలు గ‌మ‌నిస్తే.. 

Latest Videos


దేశవాళీ ఆటగాళ్లతో పోలిస్తే సచిన్ చాలా వెనుకబడ్డాడు. అయితే టీమ్ ఇండియాలో అరంగేట్రం చేసిన వెంటనే మాస్టర్ బ్లాస్టర్ వెనుదిరిగి చూసుకోలేని విధంగా దూసుకుపోయాడు. అదే సమయంలో, దేశవాళీ క్రికెట్‌లో ముందున్న ఆటగాళ్లు టీమిండియా త‌ర‌ఫున సచిన్ కంటే చాలా వెనుకబడి ఉన్నారు. దేశవాళీ క్రికెట్‌లో సెంచరీలు, పరుగులతో సచిన్‌ కంటే ముందున్న వారిలో ఛెతేశ్వర్‌ పుజారా, మనోజ్‌ తివారీ, వసీం జాఫిర్‌ల క‌నిపిస్తారు. 

ఫస్ట్ క్లాస్‌లో సచిన్ ఎన్ని సెంచరీలు చేశాడు? 

సచిన్ టెండూల్కర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 118 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో మాస్టర్ బ్లాస్టర్ బ్యాట్‌తో 9677 పరుగులు చేశాడు. అలాగే, 33 సెంచరీలు సాధించాడు. దేశ‌వాళీ క్రికెట్ లో స‌చిన్ అత్యధిక వ్య‌క్తిగ‌త స్కోరు 233 ప‌రుగులు. ఇక్క‌డ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న త‌ర్వాత అంత‌ర్జాతీయ క్రికెట్ లో సంచ‌ల‌నంగా మారాడు. 

అయితే, దేశ‌వాళీ  క్రికెట్ లో స‌చిన్ కాకుండా అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలో వసీం జాఫర్ ముందున్నారు.  ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో జాఫ‌ర్ అత్యధిక పరుగులు  చేసిన క్రికెట‌ర్. 186 మ్యాచ్‌లు ఆడి  14609 పరుగులు చేశాడు. ఇందులో ఒక ట్రిఫుల్ సెంచ‌రీ కూడా సాధించాడు. 

స‌చిన్ ను దాటేసిన పుజారా

టెస్టు క్రికెట్‌లో టీమిండియాకు వెన్నెముకగా నిలిచిన చెతేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. అయితే సచిన్ టెండూల్కర్‌తో స‌మంగా నిల‌వ‌లేక‌పోయాడు. కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పుజారా సచిన్ కంటే చాలా ముందున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారతీయ బ్యాట్స్‌మెన్ పుజారా. 

పుజారా 160 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 13201 పరుగులు చేశాడు. అందులో 40 సెంచరీలు కూడా సాధించాడు. చెతేశ్వర్ పుజారా అత్యధిక వ్య‌క్తిగ‌త‌ స్కోరు 352 ప‌రుగులు. కాగా, భార‌త జ‌ట్టు త‌ర‌ఫున పుజారా 103 టెస్టు మ్యాచ్ ల‌ను ఆడాడు. ఇందులో 7195 ప‌రుగులు చేశాడు. మూడు డ‌బుల్ సెంచ‌రీలు, 19 సెంచ‌రీలు, 35 హాఫ్ సెంచ‌రీలు చేశాడు. ఇక వ‌న్డే క్రికెట్ లో 5 మ్యాచ్ ల‌ను ఆడి 57 ప‌రుగులు చేశాడు. 

Manoj Tiwary

మనోజ్ తివారీ కూడా స‌చిన్ కంటే ఎక్కువ ప‌రుగులు 

మ‌నోజ్ తివారీ కూడా సచిన్ కంటే ఎక్కువ ప‌రుగులు చేశాడు. తివారీ 148 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 10195 పరుగులు చేశాడు. ఈ సమయంలో తివారీ 30 సెంచరీలు సాధించాడు. అతని అత్యధిక స్కోరు 303 ప‌రుగులు నాటౌట్. అద్భుతమైన గణాంకాలు ఉన్నప్పటికీ, అతనికి టీమ్ ఇండియా తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం రాలేదు.

వ‌న్డే క్రికెట్ లో కేవ‌లం 12 మ్యాచ్ లు మాత్ర‌మే ఆడే అవ‌కాశం ల‌భించింది. ఇక్క‌డ 287 ప‌రుగులు చేశాడు. ఇందులో ఒక సెంచ‌రీ, ఒక హాఫ్ సెంచ‌రీ ఉన్నాయి. మ‌నో తివారీ అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్  104 ప‌రుగులు నాటౌట్.  

click me!