Virat Kohli, RohitSharma
Rohit Sharma - Virat Kohli : భారత తొలి ప్రపంచకప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ విన్నర్లు ఇద్దరూ తమ గోల్డెన్ టైమ్‌ను మించిపోయారని సూచించారు. 35 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన కపిల్.. ఆటగాళ్ళు 34 సంవత్సరాల వయస్సు దాటితే, వారి భవిష్యత్తు పూర్తిగా శరీరం ఎలా పని (ఫిట్ నెస్) చేస్తుందో దానిపై ఆధారపడి ఉంటుందని అన్నారు.
భారత క్రికెట్ లో లెజెండ్స్
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లు కలిసి ఇటీవల 35, 36 సంవత్సరాల వయస్సులో భారతదేశం కోసం 2024 T20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్నారు. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌పై కూడా ఆడనున్నారు.
రాబోయే సిరీస్ లలో ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్ల పైనే అందరి దృష్టి ఉంది. ఈ వయసులో కూడా రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతని కెప్టెన్సీ కూడా అద్భుతమైనది. మరోవైపు విరాట్ ఫిట్‌నెస్‌పై ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ క్రికెట్‌లో ఫిటెస్ట్ ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు సాధించారు.
Rohit Sharma-Virat Kohli
అంతా కోహ్లీ-రోహిత్‌ల ఫిట్‌నెస్‌పైనే..
భారత జట్టు ప్రయాణం రాబోయే కొన్ని రోజులు అంతా కోహ్లీ-రోహిత్‌ల ఫిట్‌నెస్‌పైనే ఆధారపడి ఉంటుంది. ఇదే సమయంలో ఈ ప్లేయర్ల ఆట తీరు కొన్ని సార్లు ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే గత కొన్ని నెలలు కోహ్లికి అత్యుత్తమ ఇన్నింగ్స్ లు లేవు, కానీ అతని కొన్ని ఇన్నింగ్స్‌లు జట్టును గెలిపించడం లో సహాయపడ్డాయి.
రోహిత్, కోహ్లిలు కూడా ఏదో ఒక రోజు రిటైర్మెంట్ తీసుకుని టీమ్ ఇండియా కు వీడ్కోలు పలుకుతారు. ఆ ఖాళీని భర్తీ చేయడం భారత క్రికెట్‌కు అంత సులభం కాదు. ఇప్పుడు కపిల్ దేవ్ వారి గోల్డెన్ టైమ్ గురించి మాట్లాడుతూ.. నేరుగా వారి ఫిట్‌నెస్‌కు లింక్ చేసి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Rohit Sharma, Virat Kohli
కపిల్ దేవ్ ఏమన్నారంటే?
ఒక మీడియా ఛానెల్ తో కపిల్ దేవ్ మాట్లాడుతూ.. "నా అభిప్రాయం ప్రకారం మీ ప్రధాన వయస్సు 26 నుండి 34 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఆ తర్వాత ఆటగాళ్ల ఫిట్‌నెస్ మాత్రమే వారి కెరీర్‌కు భరోసా ఇస్తుంది. జూన్‌లో టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత కోహ్లీ, రోహిత్‌లు ఈ ఫార్మాట్ నుంచి రిటైరయ్యారు.
ఇప్పుడు భారత్ దృష్టి 2027లో జరగనున్న తదుపరి వన్డే ప్రపంచకప్‌పైనే ఉంది. ఇద్దరు ఆటగాళ్లు ఫిట్‌గా ఉంటే ఆ టోర్నీలో చూడొచ్చు. దీనికి ముందు 2025లో రెండు ఐసీసీ టోర్నమెంట్‌లను (ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్) గెలవాలని ఇద్దరూ టార్గెట్ గా పెట్టుకున్నారు" అని అన్నారు.
Rohit Sharma-Virat Kohli
రవిశాస్త్రి, టెండూల్కర్‌లను గుర్తు చేసిన కపిల్ దేవ్
సచిన్ టెండూల్కర్ 40 ఏళ్ల వరకు ఆడగా, మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్‌ను 39 ఏళ్ల వరకు కొనసాగించాడు. కోహ్లి, రోహిత్ ఇప్పటికే ఒక ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. మరి వీరిద్దరూ ఎంతకాలం ఆడతారో చూడాలని కూడా కపిల్ దేవ్ పేర్కొన్నాడు.
అలాగే, "రవిశాస్త్రి చాలా చిన్న వయస్సులో రిటైర్ అయ్యాడు, అయితే సచిన్ టెండూల్కర్ చాలా సుదీర్ఘ కెరీర్ ను కొనసాగించారు. కాబట్టి ఆటగాడు తన జీవన విధానాన్ని పూర్తిగా ఈ విషయంలో నిర్ణయించుకోవాలి. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మీరు ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం ఫిట్‌గా ఉండండి.. ఆడుతూ ఉండండి" అని పేర్కొన్నాడు.
Rohit Sharma, Virat Kohli
టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీడ్కోలు
టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు భారత జట్టుకు మూడు ఫార్మాట్లలలో అద్భుతమైన విజయాలు అందించారు. వారి కెరీర్ కూడా అద్భుతంగా సాగింది. అయితే, టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని గెలుచుకుని భారత్ ఛాంపియన్ గా నిలిచిన తర్వాత వీరిద్దరూ టీ20 క్రికెట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలికారు.
టీ20 ఫార్మాట్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వీడ్కోలు పలికిన సమయంలో ఈ ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన తొలి ఇద్దరు ప్లేయర్లుగా కొనసాగుతుండటం విశేషం. టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్, రోహిత్ ప్రస్తుతం భారత్ తరఫున వన్డే, టెస్టు క్రికెట్ ఆడుతున్నారు. మరో రెండు మూడు సంవత్సరాలకు పైగానే వీరిద్దరూ ఈ రెండు ఫార్మాట్లలో కొనసాగే అవకాశముంది.