అతను డబ్బుల గురించి పట్టించుకోడు... టీమిండియా ఆల్‌రౌండర్‌పై ఇర్ఫాన్ పఠాన్...

First Published Jan 28, 2022, 3:00 PM IST

వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌కి ప్రకటించిన టీమిండియాలో అందరి దృష్టిని ఆకర్షించిన పేరు దీపక్ హుడా. సౌతాఫ్రికా టూర్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో వెంకటేశ్ అయ్యర్ ఫెయిల్ కావడంతో ఆ ప్లేస్ దీపక్ హుడాకి దక్కింది...

46 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 9 సెంచరీలతో 2908 పరుగులు చేసిన దీపక్ హుడా, బౌలింగ్‌లో 20 వికెట్లు పడగొట్టాడు... ఫీల్డింగ్‌లోనూ 47 క్యాచులు అందుకున్నాడు...

68 లిస్టు ఏ మ్యాచుల్లో 3 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలతో 2059 పరుగులు చేసిన దీపక్ హుడా, బౌలింగ్‌లో 34 వికెట్లు పడగొట్టాడు...

123 టీ20 మ్యాచుల్లో ఓ సెంచరీ, 8 హాఫ్ సెంచరీలతో 1718 పరుగులు చేసిన దీపక్ హుడా, 15 వికెట్లు పడగొట్టాడు...

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ 2021 ఆరంభానికి ముందు అప్పటి బరోడా కెప్టెన్ కృనాల్ పాండ్యాతో విభేదాల కారణంగా జట్టుకే దూరమయ్యాడు దీపక్ హుడా...

బరోడా క్రికెట్ అసోసియేషన్, దీపక్ హుడాపై ఏడాది నిషేధం విధించడంతో తీవ్ర మనస్థాపం చెందిన ఈ బరోడా మాజీ వైస్ కెప్టెన్, రాజస్థాన్ జట్టులో చేరి కెప్టెన్‌గా మారాడు...

కృనాల్ పాండ్యా బరోడా నుంచి రాజస్థాన్‌కి మారిన సమయంలో అతనికి సపోర్ట్‌గా నిలిచాడు ‘బరోడా ఎక్స్‌ప్రెస్’ ఇర్ఫాన్ పఠాన్...

దీపక్ హుడా లాంటి టాలెంట్ ఉన్న ప్లేయర్లు, బరోడా నుంచి వెళ్లిపోతుంటే క్రికెట్ అసోసియేషన్ పట్టించుకోకుండా చూస్తోందని వాపోయాడు ఇర్ఫాన్ పఠాన్...

తాజాగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కి దీపక్ హుడా ఎంపిక కావడంపై సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేశాడు ఇర్ఫాన్ పఠాన్...

‘నువ్వు చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను. అయితే ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోకుండా పోరాడుతూనే ఉన్నావు... నిన్ను చూస్తే గర్వంగా ఉంది దీపక్ హుడా... ఈ అవకాశాన్ని చక్కగా వాడుకో...’ అంటూ ట్వీట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్...

అలాగే అండర్-19 వరల్డ్ కప్ 2020 టోర్నీ నుంచి భారత జట్టులో చోటు దక్కించుకున్న మొదటి ప్లేయర్‌గా నిలిచిన యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్‌, ఐపీఎల్ స్టార్ ఆవేశ్ ఖాన్‌లకు కూడా అభినందనలు తెలిపాడు ఇర్ఫాన్ పఠాన్...

2017లో శ్రీలంకతో టీ20 సిరీస్‌కి, ఆ తర్వాత 2018 నిదహాస్ ట్రోఫీకి దీపక్ హుడాకి ఎంపిక చేసిన తుదిజట్టులో మాత్రం అతనికి అవకాశం దక్కలేదు...

click me!