కమిన్స్, రబాడా కాదు ఐపీఎల్ లో బట్లర్‌ను భయపెట్టిన బౌలర్ అతడే..

Published : Feb 04, 2023, 11:07 AM IST

గతేడాది ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్  ఓపెనర్ బట్లర్ మెరుపులు మెరిపించాడు. 2022 సీజన్ లో అతడు   17 మ్యాచ్ లు ఆడి   57.53 సగటుతో   863 పరుగులు చేశాడు.  ఐపీఎల్ లో బట్లర్ ఇదివరకే నాలుగు సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.  

PREV
16
కమిన్స్, రబాడా కాదు  ఐపీఎల్ లో బట్లర్‌ను భయపెట్టిన బౌలర్ అతడే..

ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల సారథి జోస్ బట్లర్ గురించి ప్రత్యేక  పరిచయం అక్కర్లేదు. స్వదేశం తరఫున  ఆడుతున్నా అతడికి  భారత్  అభిమానుల మద్దతు ఉంటుంది.  ఇక ఐపీఎల్ లో బట్లర్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పన్లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో  రాజస్తాన్ రాయల్స్ తరఫున  ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ  ఇంగ్లాండ్ సారథి  ప్రస్తుతం  సౌతాఫ్రికాలో నిర్వహిస్తున్న  ఎస్ఎ 20 లీగ్ లో   పార్ల్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. 

26

ఐపీఎల్ లో తాను ఎదుర్కున్న బౌలర్లలో  అత్యంత  కఠినమైన  బౌలర్ ఎవరు..? అని ఇటీవల బట్లర్ ను ప్రశ్నించగా అతడు సౌతాఫ్రికా  పేసర్ కగిసొ రబాడానో లేక ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ పేరునో చెబుతారని అంతా భావించారు. కానీ  బట్లర్ మాత్రం  భారత  పేస్ గుర్రం  బుమ్రా పేరు చెప్పడం గమనార్హం. 
 

36

ఐపీఎల్ లో తనను భయపెట్టిన బౌలర్ బుమ్రానే అని.. అతడిని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుందని బట్లర్ అన్నాడు. ఆశ్చర్యకరంగా  బట్లర్ తన ఐపీఎల్ కెరీర్ మొదట్లో  ముంబై లో బుమ్రాతోనే కలిసి ఆడాడు.  కానీ తర్వాత అతడు రాజస్తాన్ కు మారాడు.  

46

అదీగాక ఐపీఎల్ లో ముంబైతో మ్యాచ్ అంటే  బట్లర్ రెచ్చిపోతాడు.  బుమ్రా మినహా ఇతర బౌలర్లపై బట్లర్ చెలరేగి ఆడతాడు. గత సీజన్ లో అయితే  ముంబై మీద  సెంచరీ  కూడా చేశాడు.   ఐపీఎల్ లో  బుమ్రా.. బట్లర్ ను నాలుగు సార్లు ఔట్ చేశాడు.  అతడి బౌలింగ్ లో బట్లర్ స్ట్రైక్ రేట్  కూడా  86 గానే నమోదు కావడం గమనార్హం. 

56

ఇక బట్లర్..గతేడాది ఐపీఎల్ లో  మెరుపులు మెరిపించాడు. 2022 సీజన్ లో అతడు   17 మ్యాచ్ లు ఆడి   57.53 సగటుతో   863 పరుగులు చేశాడు.  ఐపీఎల్ లో బట్లర్ ఇదివరకే నాలుగు సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.  ఈ సీజన్ లో బట్లర్.. టాప్ స్కోరర్ గా నిలిచి  రాజస్తాన్ ను ఫైనల్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.   

66

బట్లర్ తో పాటు  కొద్దిరోజుల క్రితం వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు, యూనివర్సల్ బాస్ గా  పేరొందిన  క్రిస్ గేల్ కూడా  తాను ఐపీఎల్ లో భయపడింది బుమ్రా బౌలింగ్ లోనే అని.. అతడు వేసే స్లో బంతులను తన దగ్గర సమాధానం ఉండేది కాదని చెప్పాడు. అశ్విన్, హార్భజన్ ల కంటే తనకు   బుమ్రా   బౌలింగే కఠినంగా ఉండేదిన  గేల్ తెలిపాడు. 

click me!

Recommended Stories