అతన్ని మేఘంలా కమ్మేయండి! ఆ తర్వాత అవుట్ చేయండి... విరాట్ కోహ్లీని అవుట్ చేసేందుకు ఆసీస్ బౌలర్లకు...

First Published Feb 4, 2023, 9:38 AM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఇప్పటికే ఇండియాకి వచ్చేసి, గ్రౌండ్ వర్క్ కూడా మొదలెట్టేసింది ఆస్ట్రేలియా. భారత స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు పగుళ్లు తేలిన పిచ్ మీద, రాటుతేలిన భారత యంగ్ స్పిన్నర్లను నెట్ బౌలర్లుగా పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తోంది.. ఆస్ట్రేలియాపై ఘనమైన రికార్డు ఉన్న విరాట్ కోహ్లీని అవుట్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఆసీస్...
 

టెస్టుల్లో విరాట్ కోహ్లీ 27 సెంచరీలు బాదితే, అందులో 7 సెంచరీలు ఆస్ట్రేలియాపైనే చేశాడు. ఆస్ట్రేలియాపై 19 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ, 34 ఇన్నింగ్స్‌ల్లో 1604 పరుగులు చేశాడు. అయితే టెస్టుల్లో విరాట్ కోహ్లీ ఇంకా ఫామ్‌ని అందుకోలేకపోతున్నాడు. ఆస్ట్రేలియా టూర్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 72 పరుగులు చేసి రనౌట్ అయిన కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అయ్యాడు...

‘భారత బ్యాటింగ్ ఆర్డర్‌కి విరాట్ కోహ్లీ చాలా ముఖ్యమైన బ్యాటర్. అతన్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే, టీమిండియాపై ఆధిపత్యం సాధించడానికి అంత త్వరగా అవకాశం దొరుకుతుంది. విరాట్‌ని అవుట్ చేయాలంటే పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో బరిలో దిగాలి...

విరాట్ కోహ్లీకి పరుగులు ఇవ్వకుండా అతన్ని ఇరకాటంలోకి నెట్టేయాలి. బౌలర్లు అందరూ ఒకే ప్లానింగ్‌తో అతన్ని చుట్టుముట్టాలి. విరాట్ అమ్ములపొదిలో చాలా రకాల షాట్స్ ఉన్నాయి. అయితే ఈజీగా పరుగులు ఇవ్వకపోతే, అతను రిస్కీ షాట్స్ ఆడేందుకు ప్రయత్నిస్తాడు...

కంఫర్ట్ జోన్ నుంచి తప్పుకుంటే విరాట్‌ని అవుట్ చేయడం తేలికైపోతుంది.. అయితే ప్లాన్ పక్కాగా అమలు చేయాలంటే లైన్ అండ్ లెంగ్త్ పర్ఫెక్ట్‌గా ఫాలో అయ్యే బౌలర్లు కావాలి. వీవ్ రిచర్డ్స్, గ్రెగ్ చాపెల్, సునీల్ గవాస్కర్‌ని అవుట్ చేసేందుకు ఎలాంటి ప్లానింగ్ అయితే అవసరమైతే విరాట్ కోహ్లీని అవుట్ చేయాలన్నా అంతే..

విరాట్‌ లాంటి టాప్ క్లాస్ బ్యాటర్లను అవుట్ చేయాలంటే ఎలాంటి తప్పు చేయకూడదు. మానసికంగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి. విరాట్ కంటే మానసికంగా బలంగా ఉంటేనే, అతనిపైన పైచేయి సాధించొచ్చు..

ప్లాన్ A వర్కవుట్ కాకపోతే ప్లాన్ B, అది కూడా వర్కవుట్ కాకపోతే ప్లాన్ Cతో రెడీగా ఉండాలి ’ అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జెఫ్ థామ్సన్..

click me!