మైండ్ గేమ్ మొదలెట్టిన ఆస్ట్రేలియా... అందుకే ఈ చీప్ ట్రిక్స్! - రవిచంద్రన్ అశ్విన్ కామెంట్...

First Published Feb 4, 2023, 10:43 AM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరేందుకు అడుగు దూరంలో నిలిచింది టీమిండియా. ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో రెండు టెస్టులు గెలిచినా, నేరుగా ఫైనల్‌కి క్వాలిఫై అవుతుంది భారత జట్టు. దాదాపు 19 ఏళ్ల క్రితం ఇండియాలో టెస్టు సిరీస్ గెలిచిన ఆస్ట్రేలియా, ఈసారి ఎలాగైనా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతోనే స్వదేశానికి తిరిగి వెళ్లాలనే గట్టి పట్టుదలతో బరిలో దిగుతోంది...

ఇప్పటికే నాగ్‌పూర్‌లో పగుళ్లు తేలిన పిచ్ మీద, భారత యంగ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో రాటుతేలుతున్నారు ఆస్ట్రేలియా బ్యాటర్లు. ఈసారి భారత జట్టు స్పిన్ వ్యూహానికి చిక్కకుండా పక్లా ప్లానింగ్‌తో ట్రైనింగ్‌లో చెమటోడుస్తున్నారు...

Steve Smith and Marnus Labuschagne

‘సక్రమమైన పద్ధతిలో పిచ్ తయారుచేస్తే, ఆస్ట్రేలియానే గెలుస్తుంది. బ్యాటింగ్ వికెట్స్‌పైన ఆస్ట్రేలియా గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. స్పిన్ పిచ్‌ మీద ఆడడానికి కూడా మావాళ్లు సిద్ధంగా ఉన్నారు. అయితే వాళ్లు ఎలాంటి స్పిన్ చేస్తారో అందరికీ తెలుసు...’ అంటూ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ హీలీ కామెంట్ చేశాడు..

Ravichandran Ashwin

‘ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ హీలే, సిరీస్ ఆరంభానికి ముందే పిచ్ గురించి కొన్ని విలువైన కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా కొందరు ఇండియాలో పిచ్‌లతో ఆస్ట్రేలియా ప్లేయర్లు ఇబ్బంది పడతారని అనుకోవాలని, ఈ కామెంట్లు చేశారు. గబ్బాలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ని ఎవ్వరూ మరిచిపోలేదని అనుకుంటా...

Ashwin

అప్పుడు పిచ్ గురించి ఎవ్వరూ ఏం మాట్లాడలేదే. ఆస్ట్రేలియాకి మైండ్ గేమ్ బాగా తెలుసు. సిరీస్ ఆరంభానికి ముందు ఇలాంటి కామెంట్లు చేసి ప్రత్యర్థిపై మానసికంగా పైచేయి సాధించాలని అనుకుంటారు. ఇప్పుడు వాళ్లు చేస్తుంది అదే.. 

Ashwin-R Sridhar

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా క్యాంపు నుంచి ఇలాంటి కామెంట్లు వస్తాయని తెలుసు. స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా కూడా మాట్లాడడం మొదలెడతారు. మార్నస్ లబుషేన్, మ్యాన్ రెన్షా కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందరి ఉద్దేశం ఉంటే భారత జట్టుపై మానసికంగా పైచేయి సాధించడం...

అయితే గత మూడు సీజన్లుగా మీ పప్పులు ఉడకడం లేదని మీకు తెలుసు. మూడింట్లో రెండుసార్లు మీ దేశంలోనే మిమ్మల్ని ఓడించి సిరీస్ గెలిచాం. ఇండియాలో ఆడబోతున్నారు కాబట్టి ఆ మాత్రం భయపడడంలో తప్పు లేదు...’ అంటూ తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పుకొచ్చాడు భారత స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్.. 

click me!