జాతీయ గీతం బదులు ‘జలేబి బేబీ’ సాంగ్.. పాకిస్తాన్ కు ఘోర అవమానం

Published : Sep 14, 2025, 10:55 PM IST

Asia Cup 2025 Pakistan Anthem : ఆసియా కప్ 2025 ఇండియా-పాకిస్థాన్ పోరుకు ముందు దుబాయ్ స్టేడియంలో జాతీయ గీతం స్థానంలో ‘జలేబి బేబీ’ ప్లే కావడంతో పాకిస్థాన్ జట్టు అవమానకర ఇబ్బందిని ఎదర్కొంది. దీంతో పాక్ జట్టు పై సోషల్ మీడియాలో సెటైర్లు పెలుతున్నాయి.

PREV
14
దుబాయ్ లో పాకిస్తాన్ కు అవమానం

ఆసియా కప్ 2025లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఆరంభానికి ముందు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఒక షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. సెప్టెంబర్ 14న ఆట మొదలు కాకముందు రెండు జట్లు జాతీయ గీతాల కోసం వరుసలో నిలబడ్డాయి. మొదట పాకిస్థాన్ జాతీయ గీతం, తర్వాత భారత్ జాతీయ గీతం వినిపిస్తుందని స్టేడియం అధికారిక ప్రకటనలో స్పష్టంగా తెలిపింది.

అయితే, డీజే పొరపాటు వల్ల పాకిస్థాన్ జాతీయ గీతం బదులు ప్రసిద్ధ పాప్ సాంగ్ ‘జలేబి బేబీ’ కొన్ని సెకన్లపాటు వినిపించింది. ఈ ఘటనతో పాక్ ఆటగాళ్లు, అభిమానులు ఆశ్చర్యంతో పాటు షాక్ కు గురయ్యారు. వెంటనే నిర్వాహకులు తప్పును సరిదిద్దుతూ అసలు జాతీయ గీతాన్ని ప్లే చేశారు.

24
పాక్ కు అవమానం.. సోషల్ మీడియాలో ట్రోల్స్

ఈ సంఘటన కేవలం స్టేడియంలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. అభిమానులు విపరీతంగా రియాక్ట్ అయ్యారు. “జలేబి బేబీ పాకిస్థాన్ జాతీయ గీతమా?” అంటూ ఒక యూజర్ కామెంట్ చేశాడు. మరొకరు “జాతీయ గీతం స్థానంలో జలేబి బేబీ ప్లే చేశారా?” అంటూ కామెంట్స్ చేశారు. అలాగే, ట్రోల్స్, సెటైర్లు కూడా వెస్తున్నారు.

ఈ సంఘటన వల్ల మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ జట్టు అనుకోని అవమానానికి గురైంది. అయితే సోషల్ మీడియాలో ఇది నవ్వుకునేలా మారింది. 

34
పాకిస్థాన్ బ్యాటింగ్‌ కష్టాలు

కాగా, మ్యాచ్ మొదలయ్యాక పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో అయూబ్ ఔటవ్వగా, బుమ్రా బౌలింగ్‌లో హారిస్ కూడా త్వరగానే వెనుదిరిగాడు. ఫఖర్ జమాన్ (17) రివ్యూ ద్వారా వికెట్ ను కాపాడుకున్నా, తరువాత ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసింది.

44
భారత బౌలర్ల జోరు

భారత బౌలర్లు మొత్తం మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఆరంభం నుంచే ఒత్తిడి కొనసాగించారు. కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లలో 18 పరుగులకు 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ 2 వికెట్లు సాధించగా, బుమ్రా కూడా 2 వికెట్లు తీసి మెరిశాడు. షాహీన్ షా అఫ్రిది 16 బంతుల్లో 33 పరుగులు చేసి చివరి వరకు పోరాడినా, పాకిస్థాన్ ఇన్నింగ్స్ పెద్ద స్కోరుకు చేరుకోలేదు.

Read more Photos on
click me!

Recommended Stories