Lata mangeshkar-Sara Tendulkar: రెండ్రోజుల క్రితం కన్నుమూసిన ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ లతా మంగేష్కర్ తో సచిన్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఒక్క సచిన్ తోనే కాదు...
భారత సంగీత ప్రపంచాన్ని దుఖ: సాగరంలో ముంచుతూ రెండ్రోజుల క్రితం మరణించిన లతా మంగేష్కర్ అంటే టీమిండియా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు ఎంతో ఇష్టం.
27
లతా మంగేష్కర్-సచిన్ టెండూల్కర్ లది అమ్మా కొడుకుల అనుబంధం. వాస్తవానికి ఈ ఇద్దరూ తల్లీ కొడుకులు కాకపోయినా లతాజీ సచిన్ ను కొడుకు లానే భావించింది. సచిన్ కూడా.. ఆమెను అమ్మా (ఆయి) అనే పిలిచేవాడు.
37
అయితే సచిన్ తోనే కాదు.. అతడి కూతురు సారా టెండూల్కర్ తో కూడా లతా మంగేష్కర్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. మనవరాలు వయసున్న సారాతో కూడా ఆమె స్నేహాన్ని పెంచుకుందట..
47
లతా మంగేష్కర్ సోదరి.. ప్రముఖ బాలీవుడ్ గాయని ఆశా భోస్లే మనుమరాలు జనాయ్ బోస్లే, సారా టెండూల్కర్ లు క్లోజ్ ఫ్రెండ్స్. అలా సారా.. లతాజీ కూడా దగ్గరైంది.
57
సొంత కొడుకుగా భావించే సచిన్ టెండూల్కర్ కూతురును లతాజీ కూడా మనుమరాలిగా చూసుకునేదట. లతాజీ దగ్గరకు సారా వస్తే ఆప్యాయంగా పలకరించడం.. సచిన్, అంజలి ముచ్చట్లు అడగడం చేసేదని ఆమె కుటుంబసభ్యులు గుర్తు చేసుకున్నారు.
67
ఇదిలాఉండగా.. లతా మంగేష్కర్ అంత్యక్రియలకు సచిన్ తో పాటు అతడి భార్య అంజలి కూడా హాజరయ్యింది. ఈ కార్యక్రమం అనంతరం ట్విట్టర్ వేదికగా సచిన్ భావోద్వేగ ట్వీట్ చేశాడు.
77
సచిన్ స్పందిస్తూ.. ‘లతా దీదీ జీవితంలో నేను కూడా ఓ భాగమైనందుకు అదృష్టవంతుడిని. ఆమె నాపై ఎప్పుడూ ప్రేమాభిమానాలకు కురిపించేది. ఆమె మరణంతో నా జీవితంలో కూడా ఏదో కోల్పోయినట్టు అనిపిస్తున్నది. భౌతికంగా ఆమె మరణించినా లతాజీ తన పాటలతో ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతారు...’ అని ట్వీట్ చేశాడు.