హైదరాబాదీ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్, ఐపీఎల్ 2020 పర్పామెన్స్ కారణంగా ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టు టీమ్‌కి ఎంపికయ్యాడు. అయితే అదృష్టంతో పాటే దురదృష్టం కూడా వెంటే వచ్చినట్టుగా తనకి వచ్చిన అద్భుత అవకాశాన్ని వినియోగించుకునేందుకు నెట్స్‌లో శ్రమిస్తున్న సిరాజ్‌ను తండ్రి మరణవార్త రూపంలో అనుకోని షాక్ తగిలింది...
మహ్మద్ సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. ఇలాంటి పరిస్థితుల్లో సిరాజ్‌కి అండగా నిలవాలని ప్రయత్నించిన బీసీసీఐ, తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అతన్ని స్వదేశానికి పంపడానికి సిద్ధమైంది...
220
అయితే బీసీసీఐ ఇచ్చిన ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడు సిరాజ్. ఆ సమయంలో ఆస్ట్రేలియాలో క్వారంటైన్‌లో ఉన్న మహమ్మద్ సిరాజ్... తండ్రి మహ్మద్ గౌస్‌ను చివరి చూపు కూడా చూసుకోలేకపోయాడు...
320
తన కెరీర్‌కి అండగా నిలిచిన తండ్రి కోరిక తీర్చేందుకు జట్టుతో కొనసాగేందుకు నిర్ణయం తీసుకున్నాడు. ఇంతటి విషాదంలో ఇలాంటి నిర్ణయం తీసుకుని క్రికెట్‌పట్ల తన డెడికేషన్ ఎలాంటిదో చూపించాడు సిరాజ్.
420
తాజాగా ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు ఆర్‌సీబీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రిని మరోసారి గుర్తు చేసుకుని, ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు సిరాజ్...
520
‘మా నాన్న ఎప్పుడూ దేశం గర్వించేలా చేయమని, దేశం కోసం ఆడమని అంటుండేవారు. మా అమ్మ మాత్రం చదువు మీద శ్రద్ధ పెట్టాలని చెప్పేది. మా అన్నయ్య ఇంజనీర్...
620
అందుకే నన్ను కూడా ఏదో ఒకటి చేయాలని చదువుకొమ్మని చెబుతుండేది. అయితే అమ్మ నన్ను ఎప్పుడు తిట్టినా, నాన్న అడ్డుకునేవారు...
720
ఇంటికి ఆలస్యంగా వచ్చినా, ఫ్రెండ్స్‌తో ఆడుకోవడానికి వెళ్లినా పక్కకు పిలిచి మరీ డబ్బులు ఇచ్చేవారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత నాన్నకు ఆరోగ్యం బాగోలేదని నాకు ఎవ్వరూ చెప్పలేదు...
820
ఎప్పుడు ఫోన్ చేసినా, నాన్న పడుకున్నాడని, బయటికి వెళ్లాడని చెప్పేవాళ్లు. ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత నాన్నకి సీరియస్‌గా ఉందని తెలిసింది. నాకు ఇన్నిరోజులు ఈ విషయం ఎందుకు చెప్పలేదని నేను ఇంట్లోవాళ్లపై కోపడ్డాను...
920
అయితే నా కెరీర్‌పై, నా ఆటపై ప్రభావం పడకూడదని వాళ్లు ఈ విషయం దాచి ఉంటారు. నాన్నగారు చనిపోవడానికి ముందు కూడా నాతో మాట్లాడారు. నాకు బాగానే ఉంది...
1020
బాగా ఆడి, త్వరగా ఇంటికి వచ్చేయ్. మనం కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చొని తిందాం అని చెప్పారు. దేశం గర్వించేలా ఆడాలని మరోసారి చెప్పారు...
1120
ఆయన చనిపోయారనే వార్త విన్న తర్వాత కూడా నాకు ఆ మాటలే గుర్తుకువచ్చాయి. అందుకే అక్కడే ఉండి, దేశం తరుపున ఆడాలని ఫిక్స్ అయ్యాను... ’ అంటూ చెప్పుకొచ్చాడు మహ్మద్ సిరాజ్...
1220
ఆస్ట్రేలియా టూర్‌లో గబ్బా టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు భారత జట్టు అద్వితీయ విజయంలో కీలక పాత్ర పోషించిన మహ్మద్ సిరాజ్... లార్డ్స్ మైదానంలో జరిగిన ఇండియా, ఇంగ్లాండ్ రెండో టెస్టులో 8 వికెట్లు తీసి అదరగొట్టాడు.
1320
మహ్మద్ సిరాజ్ తండ్రి చనిపోయిన సమయంలో అతను ఆస్ట్రేలియాలో 14 రోజుల క్వారంటైన్ పీరియడ్‌లో ఉన్నాడు. ఆ సమయంలో కఠినమైన క్వారంటైన్ రూల్స్ అమలులో ఉండడంతో రెండు వారాల పాటు మరో మనిషిని కలిసే అవకాశం కూడా దక్కలేదు...
1420
ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపికైన మిగిలిన ప్లేయర్ల సంగతి ఎలా ఉన్నా, ఈ 14 రోజులు మహ్మద్ సిరాజ్... ఆ గదిలో నరకాన్ని చూశాడు... తండ్రి లేడనే బాధ, ఆగని కన్నీళ్లు, మనసారా ఏడుద్దామంటే ఓదార్చే తోడు లేదు...
1520
మిరుమిట్లు కొలిపే విద్యుత్ దీపాల కాంతిలో ఆ హోటల్ గది వెలిగిపోతున్నా... అతనికి మాత్రం ఓ చీకటి గదిలో బంధించినట్టుగా అనిపించింది...
1620
‘నవంబర్‌లో భారత జట్టు 14 రోజుల క్వారంటైన్‌లో ఉన్నప్పుడు మా నాన్న మరణించారు. టీమ్ మేట్స్‌కి విషయం తెలిసినా, క్వారంటైన్ నిబంధనల కారణంగా ఎవ్వరినీ కలవలేరు, ఓదార్చలేరు...
1720
మేం క్వారంటైన్ ప్రోటోకాల్‌ను అతిక్రమిస్తారేమోననే ఉద్దేశంతో ప్రతీ క్రికెటర్ గది బయట పోలీసులను కూడా కాపలాగా పెట్టారు. ఆస్ట్రేలియాలో మమ్మల్ని ఆ 14 రోజుల క్వారంటైన్ సమయంలో జైల్లో ఖైదీల్లా చూశారు...
1820
ఆ సమయంలో చాలాసార్లు మానసికంగా కృంగిపోయా. అలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ఎవ్వరికైనా ఇది సహజం. కానీ నేను డిప్రెషన్‌లోకి వెళ్లలేదు. మొండి పట్టుదలతో మా నాన్న ఆశయాన్ని నెరవేర్చాలని నిర్ణయించుకున్నా...
1920
నాన్న లేడనే బాధను పంటి కింద దిగబట్టి, మరింత కసిగా ప్రాక్టీస్ చేశా... నాన్న లేడనే విషయం గుర్తుకువచ్చిన ప్రతిసారీ, కన్నీళ్లకు బదులుగా చెమట చిందించాలని నిర్ణయించుకున్నా... ఇంకా ఎక్కువ ప్రాక్టీస్, మరింత ఎక్కువగా చెమటోడ్చేవాడిని...
2020
మెల్‌బోర్న్ టెస్టులో నాకు ఆ అవకాశం దక్కింది.... టీమిండియా విజయాల్లో నా కొడుకు కీలక పాత్ర పోషించాలనే నాన్న కోరికను నేరవేర్చాలని నిర్ణయించుకున్నాడు... నాకు విరాట్ కోహ్లీ, అండ్ టీమ్ సపోర్ట్ కూడా తోడయ్యింది...’ అంటూ చెప్పుకొచ్చాడు మహ్మద్ సిరాజ్...