ఎంఎస్ ధోని కాదు.. టీమిండియా తొలి టీ20 సారథి ఎవరో తెలుసా..?

Published : Jan 07, 2022, 04:44 PM IST

MS Dhoni And Virender Sehwag: సంప్రదాయక టెస్టు, వన్డే క్రికెట్ కు అలవాటుపడిన టీమిండియా.. టీ20 లలో రాణిస్తుందని ఎవరికీ నమ్మకం లేని రోజుల్లోనే భారత జట్టు తొలి పొట్టి ప్రపంచకప్ ను సాధించింది. అయితే ఇంతకంటే ముందే భారత జట్టు తొలి టీ20 మ్యాచ్ ఆడిందని చాలా మందికి తెలియదు

PREV
19
ఎంఎస్ ధోని కాదు.. టీమిండియా తొలి టీ20 సారథి ఎవరో తెలుసా..?

2007లో ప్రవేశపెట్టిన తొలి ఐసీసీ టీ20 ప్రపంచకప్  లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని భారత జట్టు ఫస్ట్ టైటిల్ ను నెగ్గించుకుని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. చాలా మంది అభిమానులు.. టీ20 ప్రపంచకప్ తోనే భారత జట్టు టీ20 ఫార్మాట్ ఆడటం స్టార్ట్ చేసిందని అనుకుంటారు. 

29

కానీ కాదు.. 2007 ప్రపంచకప్ కంటే ముందే భారత జట్టు 2006లో ఓ టీ20 మ్యాచ్ ఆడింది. అది కూడా దక్షిణాఫ్రికా గడ్డ మీదనే కావడం గమనార్హం. అయితే ఈ మ్యాచుకు సారథిగా వ్యవహరించింది మాత్రం జార్ఖండ్ డైనమైట్ కాదు.

39

2006 డిసెంబర్ 1  న భారత జట్టు తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడింది. జోహన్నస్బర్గ్ వేదికగా జరిగిన ఆ  మ్యాచులో భారత జట్టు విజయం సాధించింది కూడా.. అప్పుడు భారత జట్టు కెప్టెన్ గా ఉన్నది మరెవరో కాదు.. నజఫ్గడ్ నవాబ్ వీరేంద్ర సెహ్వాగ్.

49

అవును.. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి,  ఏకైక టీ20కి సారథిగా వ్యవహరించింది వీరేంద్రుడే. ఆ మ్యాచులో ధోని కూడా ఆడాడు. కానీ కెప్టెన్ గా మాత్రం కాదు. కేవలం వికెట్ కీపర్ గా.. 

59

ఇక తర్వాత ఏడాది జరిగిన తొలి టీ20  ప్రపంచకప్ కు భారత జట్టుకు ధోని  నాయకత్వం వహించాడు.  ఆ తర్వాత అంతా చరిత్రే.. 

69

కాగా..  సెహ్వాగ్ సారథ్యం వహించిన ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9  వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ఆ జట్టు తరఫున ఆల్బీ మోర్కెల్ 26 రాణించాడు. అజిత్ అగార్కర్ 2.3 ఓవర్లు వేసి 10 పరుగులు  ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. 

79

ఇక లక్ష్య ఛేదనలో టీమిండియా.. 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. దినేశ్ మోంగియా (45 బంతుల్లో 38)తో పాటు సెహ్వాగ్ (34) కూడా రాణించారు. దీంతో ఈ మ్యాచులో విజయం భారత్ ను వరించింది.

89

ఆ తర్వాత సెహ్వాగ్ మరో 19 టీ20 మ్యాచులు ఆడాడుగానీ నాయకత్వం చేపట్టలేకపోయాడు. అంతేగాక భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ చేసిన అరుదైన గౌరవం కూడా సెహ్వాగ్ కు ఈ మ్యాచ్ తో దక్కింది. 

99

ఏకైక టీ20 మ్యాచ్ తో పాటు వీరూ.. 12 వన్డేలు, 4 టెస్టులలో కూడా సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆధునిక క్రికెట్ లో మూడు ఫార్మాట్లలో కెప్టెన్ గా  పనిచేసిన అతికొద్దిమంది భారత క్రికెటర్లలో సెహ్వాగ్ ఒకడిగా నిలిచాడు. 

Read more Photos on
click me!

Recommended Stories