అతనికి బ్యాటింగ్ రాకపోతే కోపం వచ్చేస్తుంది... శార్దూల్ ఠాకూర్‌పై ఇమ్రాన్ తాహీర్ కామెంట్...

First Published Jan 7, 2022, 3:15 PM IST

గబ్బాలో జరిగిన టెస్టులో రీఎంట్రీ ఇచ్చిన శార్దూల్ ఠాకూర్, అప్పటినుంచి భారత జట్టులో కీ ప్లేయర్‌గా మారిపోయాడు. అటు బ్యాటుతోనూ, ఇటు బాల్‌తోనూ రాణిస్తూ అదరగొడుతున్నాడు శార్దూల్...

ఇప్పటిదాకా శార్దూల్ ఠాకూర్ ఆడిన ఆరు టెస్టుల్లో ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడింది టీమిండియా. అది కూడా జోహన్‌బర్గ్‌లో సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులోనే...

Shardul Thakur

తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన శార్దూల్ ఠాకూర్, రెండో ఇన్నింగ్స్‌లో 24 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసి కొన్ని మెరుపులు మెరిపించాడు...

శార్దూల్ ఠాకూర్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత భారత సారథి విరాట్ కోహ్లీతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా చప్పట్లతో అభినందిస్తూ డ్రెస్సింగ్ రూమ్‌లోకి స్వాగతం పలికారు...

 తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్, రెండో ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్‌ను అవుట్ చేసి భారత జట్టుకి మొదటి బ్రేక్ అందించాడు...

‘శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ విషయంలో చాలా కర్ తీసుకుంటాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడిన సమయంలో శార్దూల్ ఠాకూర్‌తో చాలా సమయం గడిపాను...

shardul thakur

అతను బ్యాటింగ్ ప్రాక్టీస్‌ని కూడా చాలా సీరియస్‌గా తీసుకుంటాడు. కొన్నిసార్లు మిగిలిన బ్యాట్స్‌మెన్ కారణంగా శార్దూల్ ఠాకూర్ వంటి వాళ్లకు నెట్స్‌లో ఎక్కువ సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడానికి అవకాశం దొరకదు...

అలాంటి సందర్భాల్లో శార్దూల్ ఠాకూర్‌కి బాగా కోపం వచ్చేది. అతని అలక చూసి మిగిలిన బౌలర్లు... శార్దూల్ ఠాకూర్ కోసం మరికొంత సమయం నెట్స్‌లో గడిపేవాళ్లు...

టీమిండియాకి పర్ఫెక్ట్‌ ఆల్‌రౌండర్‌గా మారాలనేది శార్దూల్ ఠాకూర్ లక్ష్యం. అందుకే తుదిజట్టులో ఉన్న ప్రతీసారీ తన మార్క్‌ చూపించాలనే తపన అతనిలో కనిపిస్తుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు సీఎస్‌కే మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్...

చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్ 2021 టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన శార్దూల్ ఠాకూర్‌కి, ఐపీఎల్ 2022 రిటెన్షన్స్‌లో చోటు దక్కకపోవడం విశేషం...

ఎమ్మెస్ ధోనీతో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మొయిన్ ఆలీలను అట్టిపెట్టుకున్న సీఎస్‌కే, యంగ్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను రిటైన్ చేసుకుంది...

click me!