కోహ్లీ, రోహిత్, పూజారా కాదు, అసలైన ప్రమాదం అతనితోనే... టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో...

First Published May 27, 2021, 11:36 AM IST

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ కోసం అన్ని అస్త్రాలతో సిద్ధమవుతోంది టీమిండియా. మరోవైపు న్యూజిలాండ్ కూడా టీమిండియాను కట్టడి చేసేందుకు ఎత్తులకు పైఎత్తులు రచిస్తోంది. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పూజారా కంటే రిషబ్ పంత్‌తోనే తమకు ప్రమాదం పొంచిఉందని అంటున్నాడు న్యూజిలాండ్ కోచ్ షేన్ జర్గెన్‌సన్. 

ఆస్ట్రేలియా టూర్ 2020 నుంచి ఓ కొత్త ప్లేయర్‌గా మారిపోయాడు భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. మెల్‌బోర్న్ టెస్టులో మెరుపులు మెరిపించి, సిడ్నీలో సెంచరీకి చేరువై అవుటైన రిషబ్ పంత్, గబ్బా టెస్టులో విన్నింగ్ షాట్‌ కొట్టి గర్జించాడు.
undefined
ఇంగ్లాండ్‌లోని సౌంతిప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో కూడా రిషబ్ పంత్‌ కీలకంగా మారాడని, అతనితో తమకు ముప్పు పొంచి ఉందని అంటున్నాడు న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్ జర్గెన్‌సన్.
undefined
‘విరాట్ కోహ్లీ, అజింకా రహానే, రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పూజారాలతో భారత బ్యాటింగ్ విభాగం చాలా బలంగా కనిపిస్తోంది. అయితే వీరందరికంట రిషబ్ పంత్ చాలా ప్రమాదకర ప్లేయర్.
undefined
అతను క్రీజులో ఉంటే మ్యాచ్‌ను ఇట్టే మలుపు తిప్పేస్తాడు. బౌలర్ల చేతుల్లోంచి,ఆధిక్యాన్ని లాక్కోగలడు. ఆస్ట్రేలియా టూర్‌లో, ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అతను చాలా బాగా ఆడాడు. అలాంటి ఇన్నింగ్స్ ఫైనల్ ఆడితే, మాకు ప్రమాదమే...
undefined
రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో దూకుడు కనిపిస్తోంది. అతను ఎక్కువసేపు క్రీజులో ఉంటే, ఏ జట్టుకైనా ప్రమాదమే. అయితే అతన్ని అవుట్ చేయడం పెద్దగా కష్టమేమీ కాదు. కచ్చితమైన బంతులు వేస్తూ అతన్ని ఇబ్బంది పెడితే చాలు...
undefined
రిషబ్ పంత్ తన పాజిటివ్ యాటిట్యూడ్‌తో బౌలర్లను అసహనానికి, ఒత్తిడికి గురి చేస్తున్నాడు. పంత్ బ్యాటింగ్ చేస్తుంటే, బౌలర్లు అంతకంటే ప్రశాంతంగా బౌలింగ్ చేయాలి. అప్పుడే అతని వికెట్ తీయొచ్చు...’ అంటూ చెప్పుకొచ్చాడు జర్గెన్‌సన్.
undefined
‘మా బౌలింగ్ చాలా బాగుంది. అయితే టీమిండియాలో కూడా చాలా నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ... ఎలాంటి పరిస్థితుల్లో అయినా కట్టుదిట్టమైన బౌలింగ్ చేయగలరు.
undefined
అలాగే రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌ వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు. వారితో పాటు అక్షర్ పటేల్ కూడా అదరగొడుతున్నారు. శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ అయితే బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నారు...’ అంటూ కామెంట్ చేశాడు జర్గెన్‌సన్.
undefined
click me!