మా నాన్నతో కలిసి మందు కొడతా... భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు...

Published : May 27, 2021, 11:08 AM IST

భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత హెడ్ కోచ్ రవిశాస్త్రి నేడు 59వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. భారత జట్టులోకి స్పిన్నర్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా మారాడు రవిశాస్త్రి. క్రికెట్‌లో ‘చపాతీ షాట్’కి రూపకల్పన చేసిన రవిశాస్త్రి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు...

PREV
116
మా నాన్నతో కలిసి మందు కొడతా... భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు...

245 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన రవిశాస్త్రి, 13,202 పరుగులు, 509 వికెట్లు తీశాడు. 278 లిస్టు ఏ మ్యాచుల్లో 6383 పరుగులు చేసి 254 వికెట్లు పడగొట్టాడు. భారత జట్టు తరుపున 80 టెస్టులు ఆడిన రవిశాస్త్రి, 11 సెంచరీలతో 3830 పరుగులు చేశాడు.

216

150 వన్డేల్లో 3108 పరుగులు చేసిన రవిశాస్త్రి, 129 వికెట్లు తీశాడు. ఆరంగ్రేటం టెస్టు మ్యాచ్‌లో 10వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన రవిశాస్త్రి, తన ఆల్‌రౌండ్ స్కిల్స్‌తో ఓపెనర్‌గా మారాడు.

316

ఆస్ట్రేలియాలో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రవిశాస్త్రి. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై 206 పరుగులు చేసిన రవిశాస్త్రి టాప్‌లో ఉండగా పాక్ క్రికెటర్ అజర్ ఆలీ 205 పరుగులు, సెహ్వాగ్ 195, గవాస్కర్ 172, లక్ష్మణ్ 167 పరుగులు చేశారు.

416

విదేశాల్లో డబుల్ సెంచరీ చేసి, ఐదు వికెట్లు తీసిన ఒకే ఒక్క భారత బ్యాట్స్‌మెన్ రవిశాస్త్రి. ఆస్ట్రేలియాపై జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఈ రికార్డు ఫీట్ సాధించాడు రవిశాస్త్రి.

516

1983 వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న రవిశాస్త్రి, ఆ టోర్నీలో పెద్దగా మ్యాచులు ఆడేందుకు అవకాశం రాలేదు. అయితే ఆ తర్వాత జరిగిన పాకిస్తాన్ టూర్‌లో మంచి పర్ఫామెన్స్ చూపించాడు రవిశాస్త్రి. 

616

1981లో దిలిప్ దోషి గాయం కారణంగా తప్పుకోవడంతో అతని స్థానంలో రిప్లేస్‌మెంట్‌గా జట్టులోకి వచ్చాడు రవిశాస్త్రి. మ్యాచ్‌కి ముందు రోజు వెల్లింగ్టన్‌కి చేరుకున్న రవిశాస్త్రి, న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో 6 వికెట్లు తీసుకున్నాడు. 

716

మొదటి మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు బంతుల్లో 3 వికెట్లు తీసుకున్నాడు రవిశాస్త్రి. రవిశాస్త్రి బౌలింగ్‌లో పడిన మూడు వికెట్లు, దిలీప్ వెంగ్‌సర్కార్ క్యాచ్ అందుకోవడం మరో విశేషం. 

816

1984లో జింబాబ్వేలో పర్యటించిన భారత జట్టుకి తొలిసారి కెప్టెన్‌గా వ్యవహారించాడు రవిశాస్త్రి. 1985లో జరిగిన ‘ది ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్’ సిరీస్‌లో 182 పరుగులతో పాటు 8 వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలిచిన రవిశాస్త్రి, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీతో ప్రశంసలు పొందారు.

916

1995లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో‌ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ బాది రికార్డు క్రియేట్ చేశాడు రవిశాస్త్రి. కేవలం 113 నిమిషాల్లో డబుల్ సెంచరీ బాదిన రవిశాస్త్రి రికార్డు 33 ఏళ్ల పాటు అలాగే ఉండింది. అయితే 2017లో ఆఫ్గాన్ ప్లేయర్ సఫీకుల్లా, 103 నిమిషాల్లో డబుల్ సెంచరీ చేసి ఆ రికార్డు బ్రేక్ చేశాడు.

1016

1990, మార్చి 18న రితూ సింగ్‌ను పెళ్లాడిన రవిశాస్త్రి, 1995లో టీవీ కామెంటేటర్‌గా ఎంట్రీ ఇచ్చారు. అనేక సిరీస్‌లకు, ఐపీఎల్ మ్యాచ్‌లకు కామెంటేటర్‌గా వ్యవహారించిన రవిశాస్త్రి... 2011 వన్డే వరల్డ్‌కప్‌లో ధోనీ కొట్టిన హెలికాఫ్టర్ షాట్‌కి ఇచ్చిన కామెంటరీ హైలైట్‌గా నిలిచింది.

1116

సౌరవ్ గంగలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌లతో ఏర్పాటుచేసిన క్రికెట్ అడ్వైసరీ కమిటీ, రవిశాస్త్రిని హెడ్‌కోచ్‌గా ఎంపిక చేసింది. 2017 జూలైలో మొదటిసారిగా భారత కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రవిశాస్త్రి, 2019 ఆగస్టులో మరోసారి అదే బాధ్యతను తీసుకున్నాడు.

1216

బాలీవుడ్ హీరోయిన్ నిమ్రత్ కౌర్‌తో రవిశాస్త్రి డేటింగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే నిమ్రత్, రవిశాస్త్రితో డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలు కేవలం పుకార్లేనంటూ కొట్టిపారేసింది.

1316

అయితే పెళ్లికి ముందు అమ్రితా సింగ్‌, టెన్నిస్ స్టార్ గబ్రిల్లా సబాటినిలతో డేటింగ్ చేశాడు రవిశాస్త్రి. అయితే వీరి ప్రేమ వ్యవహారం పెళ్లిదాకా సాగలేదు. 1990లో రితూ సింగ్‌ని పెళ్లాడిన రవిశాస్త్రికి, 18 ఏళ్ల తర్వాత ఓ కూతురు ఆలేఖ జన్మించింది.

1416

రంజీ ట్రోఫీలో బరోడాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరుపున బరిలో దిగిన రవిశాస్త్రి, ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదాడు. విండీస్ మాజీ బ్యాట్స్‌మెన్ సర్ గ్యారీ సోబర్స్ తర్వాత ఆరుకి ఆరు సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా నిలిచాడు రవిశాస్త్రి.

1516

రవిశాస్త్రి, తన తాగుడు అలవాటు కారణంగా విపరీతమైన ట్రోలింగ్‌ ఎదుర్కొన్నాడు. అయితే బాధేసినా, సంతోషం వేసినా తన జీవితంలో ఎంతో గౌరవించే తన తండ్రితో కలిసే మద్యం సేవించేవాడినని చాలాసార్లు చెప్పుకొచ్చాడు రవిశాస్త్రి...

1616

భారత జట్టు ఓడిన ప్రతీసారి తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొనే మొదటి వ్యక్తిగా రవిశాస్త్రి కనిపిస్తాడు. గెలిచిన సందర్భాల్లో ఆఖరిగా రవిశాస్త్రికి క్రెడిట్ దక్కుతోంది. దీనికి కారణం కూడా అతని మందు అలవాటే.

click me!

Recommended Stories