కనీసం ఈ టీమ్‌లో కూడా సంజూ శాంసన్ పనికి రాడా? టీమిండియా హెడ్ కోచ్‌పై ట్రోలింగ్...

Published : Jun 27, 2022, 10:40 AM IST

అప్పుడెప్పుడో ఏడేళ్ల కిందట 2015లో టీమిండియా తరుపున అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు సంజూ శాంసన్. నిన్న మొన్న ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్ 14 టీ20 మ్యాచులు ఆడితే, ఏడేళ్ల కిందట ఎంట్రీ ఇచ్చిన సంజూ శాంసన్ ఇప్పటిదాకా ఆడింది 13 టీ20లే...

PREV
17
కనీసం ఈ టీమ్‌లో కూడా సంజూ శాంసన్ పనికి రాడా? టీమిండియా హెడ్ కోచ్‌పై ట్రోలింగ్...

దేశవాళీ టోర్నీల్లో, ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నా సంజూ శాంసన్‌కి తుది జట్టులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులోనూ సంజూ శాంసన్ పేరు లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

27

ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కి సంజూ శాంసన్‌ని ఎంపిక చేసి, ట్రోలింగ్‌కి ఫుల్ స్టాప్ పెట్టారు సెలక్టర్లు. అయితే తొలి టీ20లో తుది జట్టులో సంజూ శాంసన్‌కి చోటు దక్కలేదు. సంజూ శాంసన్‌కి బదులుగా బరోడా టీమ్‌మేట్ దీపక్ హుడాకి అవకాశం ఇచ్చాడు హార్ధిక్ పాండ్యా...
 

37

భారత ప్రధాన జట్టులో ఉండాల్సిన సంజూ శాంసన్‌కి కనీసం బీ టీమ్‌లో కూడా ప్లేస్ లేకుండా చేయడం అన్యాయం అంటూ భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌, టీమిండియా మేనేజ్‌మెంట్‌‌ని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

47

సంజూ శాంసన్ దక్షిణాది వాడు కావడం వల్లే ఎంత టాలెంట్ ఉన్నా, టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోతున్నాడని... ఉత్తరాది వాడైన రిషబ్ పంత్‌ ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నా మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తున్న టీమ్ మేనేజ్‌మెంట్... శాంసన్‌ని మాత్రం కావాలని పక్కనబెడుతోందని విమర్శిస్తున్నారు నెటిజన్లు... 

57

2019లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్‌లో జో రూట్ యాంకర్లకు చోటు ఇవ్వలేదని, సంజూ శాంసన్ లాంటి హిట్టర్లతోనే టీమ్‌‌ని నింపేసిందని... అదే వారి విజయానికి కారణమనే విషయాన్ని టీమిండియా ఎప్పుడు తెలుసుకుంటుందోనని హితవు చేస్తున్నారు మరికొందరు నెటజన్లు...

67
Sanju Samson

‘దీపక్ హుడా కారణంగా సంజూ శాంసన్ తుదిజట్టులోకి రాలేదనేది నిజం కాదు. ఎందుకంటే సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి.. సౌతాఫ్రికా సిరీస్ ఆడిన శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ స్థానంలో టీమ్‌లోకి వచ్చారు. దీపక్ హుడా ముందునుంచే జట్టులో ఉన్నాడు... ఆల్‌రౌండర్ కావడంతో దీపక్ హుడాకి తుదిజట్టులో చోటు కల్పించి ఉండవచ్చు’ అంటూ కామెంట్ చేశాడు గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా...

77

ఐపీఎల్ 2021 సీజన్‌లో 14 మ్యాచులాడి ఓ సెంచరీతో 484 పరుగులు చేసిన సంజూ శాంసన్, 2022 సీజన్‌లో 17 మ్యాచులు ఆడి 458 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా రాజస్థాన్ రాయల్స్‌ని ఐపీఎల్ 2022 ఫైనల్‌కి చేర్చాడు.  

Read more Photos on
click me!

Recommended Stories