ఓపెనర్‌గా దీపక్ హుడా... రుతురాజ్ గైక్వాడ్‌కి ఏమైంది? ట్రెండింగ్‌లో సీఎస్‌కే ప్లేయర్...

Published : Jun 27, 2022, 10:03 AM IST

రుతురాజ్ గైక్వాడ్... ఐపీఎల్‌లో అతి పిన్న వయసులో ఆరెంజ్ క్యాప్ గెలిచిన ప్లేయర్. అయితే ఐపీఎల్ 2021 తర్వాత రుతురాజ్ గైక్వాడ్, టీమిండియాలోకి చోటు కోసం చాలా కాలం పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆకట్టుకున్న రుతురాజ్ గైక్వాడ్, ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఓపెనింగ్‌కి రాకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది...

PREV
17
ఓపెనర్‌గా దీపక్ హుడా... రుతురాజ్ గైక్వాడ్‌కి ఏమైంది? ట్రెండింగ్‌లో సీఎస్‌కే ప్లేయర్...

ఇషాన్ కిషన్‌తో పాటు దీపక్ హుడా ఓపెనింగ్ చేయడంతో టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. రుతురాజ్ గైక్వాడ్ ఎందుకు ఓపెనింగ్‌కి రాలేదు? అనే ప్రశ్న సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది...

27
Image credit: PTI

వర్షం కారణంగా తొలి టీ20ని కుదించి 12 ఓవర్ల మ్యాచ్‌గా మార్చారు అంపైర్లు. అదీకాకుండా ఐర్లాండ్ ఏకంగా 108 పరుగుల భారీ స్కోరు చేసి టీమిండియా ముందు పెట్టింది. దీంతో ఆరంభంలో నెమ్మదిగా ఆడతాడనే ఉద్దేశంతో రుతురాజ్ గైక్వాడ్‌ని కావాలనే పక్కనబెట్టి ఉంటాడని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి...

37
Image credit: PTI

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచి, 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచిన రుతురాజ్ గైక్వాడ్... ఇప్పటిదాకా 9 మ్యాచులు ఆడి 8 ఇన్నింగ్స్‌ల్లో 135 పరుగులు చేశాడు. సగటు 16.88 మాత్రమే...

47
Ruturaj Gaikwad

అయితే 2021 ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన తర్వాత విజయ్ హాజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో పరుగుల వరద పారించాడు రుతురాజ్ గైక్వాడ్. దీంతో అతనిపై నమ్మకంతో వరుస అవకాశాలు ఇస్తూ వస్తోంది టీమిండియా...

57

వాస్తవానికి ఐర్లాండ్‌తో మొదటి టీ20లో రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్‌కి రాకపోవడానికి అతను ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడడమే కారణమట. ఇప్పటికే రెండు సార్లు కరోనా బారిన పడిన రుతురాజ్ గైక్వాడ్, సౌతాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ20లో సెల్ఫీ కోసం డగౌట్‌లోకి వచ్చిన గ్రౌండ్‌మెన్‌తో దురుసుగా ప్రవర్తించి వార్తల్లో నిలిచాడు...

67
Image credit: PTI

తాజాగా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో గాయపడి మరోసారి వార్తల్లో నిలిచాడు రుతురాజ్ గైక్వాడ్. దేవ్‌దత్ పడిక్కల్, పృథ్వీషా, రాహుల్ త్రిపాఠి వంటి ప్లేయర్లు టీమిండియాలో చోటు కోసం తపస్సు చేస్తుంటే... రుతురాజ్ గైక్వాడ్‌ని ఆ అవకాశం వరించినా, అవకాశం మాత్రం కలిసి రావడం లేదని ట్రోల్స్ చేస్తున్నారు మరికొందరు..   

77

ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రుతురాజ్ గైక్వాడ్ వేలికి గాయమైందని సమాచారం. దీంతో అతను ఐర్లాండ్‌తో జరిగే రెండో టీ20కి అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది అనుమానంగా మారింది... 

click me!

Recommended Stories