ఈ మాత్రం దానికి ఆడించడం దేనికి... ఉమ్రాన్ మాలిక్‌ని సరిగ్గా వాడుకోని హార్ధిక్ పాండ్యా...

Published : Jun 27, 2022, 09:37 AM IST

ఐపీఎల్ 2022 సీజన్ పర్ఫామెన్స్ తర్వాత టీమిండియా ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్. 150+కి.మీ.ల వేగంతో బంతులు వేసే ఉమ్రాన్ మాలిక్ ఉగ్రరూపాన్ని అంతర్జాతీయ క్రికెట్‌లో చూడాలని ఎదురుచూసిన ఫ్యాన్స్‌కి, మొదటి మ్యాచ్‌లో ఆ అవకాశం ఇవ్వలేదు హార్ధిక్ పాండ్యా...

PREV
17
ఈ మాత్రం దానికి ఆడించడం దేనికి... ఉమ్రాన్ మాలిక్‌ని సరిగ్గా వాడుకోని హార్ధిక్ పాండ్యా...

ఐర్లాండ్‌తో తొలి టీ20లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు ఉమ్రాన్ మాలిక్. అయితే వర్షం కారణంగా 12 ఓవర్లు సాగిన మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్‌తో వేయించింది ఒక్కటంటే ఒకే ఓవర్...

27
Image credit: PTI

టీ20ల్లో మొదటి ఓవర్‌లోనే వికెట్లు తీయాలి, లేదా తక్కువ పరుగులు ఇచ్చి మెప్పించాలని కోరుకోవడం అత్యాశే కాదు, అన్యాయం కూడా..  ఐపీఎల్‌లో కూడా మొదటి ఓవర్‌లో ఎక్కువ పరుగులు ఇచ్చిన ఉమ్రాన్ మాలిక్, ఆ తర్వాతి ఓవర్లలో 3, 4 వికెట్లు తీశాడు...

37

ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో ఉమ్రాన్ మాలిక్‌కి బాల్ అందించాడు హార్ధిక్ పాండ్యా. అంతర్జాతీయ కెరీర్‌లో మొదటి బంతిని 148కి.మీ.ల వేగంతో వేసిన ఉమ్రాన్ మాలిక్, ఆ ఓవర్‌లో నిలకడగా 140+ కి.మీ.ల వేగాన్ని అందుకున్నా 150+ వేగాన్ని అందుకోలేకపోయాడు...

47

ఆ ఓవర్‌‌లో మొత్తంగా 18 పరుగులు కాగా లెగ్ బైస్ రూపంలో 4 పరుగులు వచ్చాయి. దీంతో సీనియర్లు భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చాహాల్‌లతో మూడేసి ఓవర్లు వేయించిన హార్ధిక్ పాండ్యా తానో రెండు ఓవర్లు వేసి, ఆవేశ్ ఖాన్‌కి రెండు ఓవర్లు ఇచ్చాడు..

57

కనీసం యజ్వేంద్ర చాహాల్‌కి రెండు ఓవర్లు ఇచ్చి, ఆరంగ్రేటం మ్యాచ్ ఆడుతున్న ఉమ్రాన్ మాలిక్‌కి మరో ఓవర్ ఇచ్చి ఉంటే బాగుండేదని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే తొలి టీ20లో భువీ, హర్ధిక్ పాండ్యా, ఆవేశ్ ఖాన్‌, ఉమ్రాన్ మాలిక్‌తో కలిపి నలుగురు ఫాస్ట్ బౌలర్లు తుదిజట్టులోకి వచ్చారు. యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్‌లతో కలిపి మొత్తంగా ఆరుగురు బౌలర్లతో బరిలో దిగింది టీమిండియా...

67

అసలే వర్షం కారణంగా మ్యాచ్ 12 ఓవర్లకు కుదించుకుపోవడంతో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్‌కి చెప్పుకోదగ్గ మెమొరీస్ అయితే ఏమీ మిగల్లేదు. కనీసం రెండో టీ20 అయినా సజావుగా సాగి, ఉమ్రాన్ మాలిక్‌కి పూర్తి ఓవర్లు వస్తాయో లేదో చూడాలి... 

77

అసలే వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం కావడంతో భారత్‌లో జనాలు అర్ధరాత్రి దాకా వేచి చూడాల్సి వచ్చింది. ఉమ్రాన్ మాలిక్ ఆరంగ్రేటం చేస్తున్నాడని సంతోషంతో ఆతృతగా ఎదురుచూసిన అభిమానులకు, తొలి టీ20లో నిరాశే ఎదురైంది..

click me!

Recommended Stories