అతడి ఫామ్ గురించి ఇబ్బంది లేదు.. కానీ అసలు సమస్య అదే.. ముంబై సారథిపై హెడ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Apr 14, 2022, 03:14 PM IST

Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలో తిరుగులేని జట్టుగా  ఉన్న ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో చతికిలపడుతున్న తీరు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నది.  ముఖ్యంగా ఆ జట్టు సారథి రోహిత్ శర్మ ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

PREV
19
అతడి ఫామ్ గురించి ఇబ్బంది లేదు.. కానీ అసలు సమస్య అదే.. ముంబై  సారథిపై హెడ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఒకప్పుడు క్రీజులోకి వచ్చాడంటే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతూ ప్రత్యర్థుల మీద దండయాత్రకు దిగే రోహిత్ శర్మ గత రెండు సీజన్లుగా ఆ దూకుడు  చూపలేకపోతున్నాడు.  మరీ ముఖ్యంగా  ఈ సీజన్ లో హిట్ మ్యాన్ దారుణంగా విఫలమవుతున్నాడు. 

29

ఈ సీజన్ లో ఇప్పటివరకు  5 ఇన్నింగ్స్ లలో కలిపి 108 పరుగులు చేశాడు  రోహిత్ శర్మ. అయితే రోహిత్ ఫామ్ మీద తమకు ఇబ్బందేం లేదని,  ఒక్క  భారీ ఇన్నింగ్స్ తో అదంతా సెట్ అవతుందని అంటున్నాడు ముంబై హెడ్ కోచ్  మహేళ జయవర్ధనే. 

39

ఐపీఎల్-15 లో ఇప్పటిదాకా ఐదు మ్యాచులాడిన రోహిత్ శర్మ చేసిన పరుగులు 108.  రోహిత్ స్కోర్లు ఇలా ఉన్నాయి. 41, 10, 3, 26, 28.. అత్యధిక స్కోరు 41 (ఢిల్లీపై)

49

పంజాబ్ తో మ్యాచ్ అనంతరం జయవర్దనే మాట్లాడుతూ... ‘రోహిత్ ఫామ్ గురించి మాకు ఆందోళన లేదు. భారీ స్కోర్లు చేయకపోయినప్పటికీ  హిట్ మ్యాన్ మాత్రం  అద్భుత ఆరంభాలిస్తున్నాడు కదా.  ఈ మ్యాచ్ (పంజాబ్) లోనే చూడండి. తొలి ఓవర్లోనే ఓ ఫోర్, సిక్సర్ బాదాడు. తర్వాత రబాడా బౌలింగ్ లో కూడా  దాడికి దిగాడు. 

59

బ్యాటింగ్ లో అతడి టైమింగ్ అద్భుతం. వాటిని భారీ స్కోర్లుగా చేయకపోవడంపై రోహిత్ కూడా  కాస్త నిరాశగా ఉన్న మాట వాస్తవమే. అయితే అలా జరగడానికి ఒక మంచి ఇన్నింగ్స్ చాలు. 

69

రోహిత్ బ్యాటింగ్ గురించి మనకు తెలుసు. 14-15 ఓవర్ల దాకా క్రీజులో నిలిచి భారీ స్కోర్లు చేయడమనేది అతడికి పెద్ద విషయం కాదు. అతడు  క్వాలిటీ ప్లేయర్.  రోహిత్ ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిందేమీ లేదు..’ అని చెప్పుకొచ్చాడు. 

79

ఇక పంజాబ్ తో మ్యాచ్ లో  ముంబై ఓపెనర్లు రోహిత్ - ఇషాన్ కిషన్ నిష్క్రమించిన తర్వాత  క్రీజులోకి వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మలపై జయవర్దనే ప్రశంసల జల్లు కురిపించాడు. వాళ్లిద్దరి సామర్థ్యాలు తమకు తెలుసునని,   అందుకే వాళ్లకు స్వేచ్ఛనిచ్చామని తెలిపాడు.

89

‘ఆ ఇద్దరు కుర్రాళ్ల (బ్రెవిస్, తిలక్) సామర్థ్యం  మాకు తెలుసు.  అందుకే ఈ మ్యాచ్ లో వాళ్లు స్వేచ్ఛగా ఆడేలా స్వేచ్ఛనిచ్చాం. వాళ్లు స్వేచ్ఛగా ఆడి పరిస్థితులు అదుపులోకి వస్తే ఆ తర్వాత వెళ్లే పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్ లు  పని కానిచ్చేస్తారని మేం భావించాం.  అది  మా  వ్యూహంలో భాగంగా ఉంది. కానీ అది మేం అనుకున్నంత వర్కవుట్ కాలేదు.  కీలక సమయంలో రెండు రనౌట్లు మాకు తీవ్ర నష్టం కలిగించాయి..’ అని  వివరించాడు. 

99

పంజాబ్ నిర్దేశించిన 199 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై ఓపెనర్లు 32 పరుగులకే వెనుదిరిగిన క్రమంలో  డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 49), తిలక్ వర్మ (20 బంతుల్లో 36) లు సుడిగాలి ఇన్నింగ్స్  ఆడారు. రాహుల్ చాహర్ వేసిన  ఓవర్లో బ్రెవిస్ వరుసగా  నాలుగు సిక్సర్లు, ఫోర్ బాదాడు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 84 పరుగులు జోడించారు. కానీ తర్వాత ఓవర్లోనే వెనుదిరగడంతో ముంబై భారీ మూల్యం చెల్లించుకుంది. 

Read more Photos on
click me!

Recommended Stories