బౌలర్లు రాణించకుంటే ఏ కెప్టెన్ అయినా ఏం చేస్తాడు.. వాళ్ల తప్పులకు హిట్ మ్యాన్ ను నిందిస్తే ఎలా..?

Published : Apr 14, 2022, 01:35 PM IST

TATA IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్ లో  వరుసగా ఐదు మ్యాచులు ఓడిన ముంబై ఇండియన్స్..  ఒక్క విజయం కోసం వేయి కండ్లతో వేచి చూస్తున్నది.  అయితే ముంబై ఓటములకు ఆ జట్టు సారథి రోహిత్ ను నిందించడమేంటని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. 

PREV
18
బౌలర్లు రాణించకుంటే ఏ కెప్టెన్ అయినా ఏం చేస్తాడు.. వాళ్ల తప్పులకు హిట్ మ్యాన్ ను నిందిస్తే ఎలా..?

ఈ సీజన్ లో వరుసగా ఐదు మ్యాచులు ఓడి తీవ్ర విమర్శల పాలవుతున్న ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ ఇక కెప్టెన్సీ పదవి నుంచి దిగిపోవాలని విమర్శలు వస్తున్నాయి. 

28

ముంబై కెప్టెన్సీతో పాటు భారత జట్టు  సారథ్య బాధ్యతలు కూడా రావడంతో రోహిత్ శర్మ  ఈసారి అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. దీంతో ఈ సీజన్ లో ముంబై ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు. 

38

ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్  గ్రేమ్ స్వాన్ రోహిత్ కు మద్దతుగా నిలుస్తున్నాడు.  ముంబై ఇండియన్స్ ఓటములకు  బౌలర్లు కారణమని, దానికి రోహిత్ ను నిందిచడం తగదని అన్నాడు. 

48
Tymal Mills

బుధవారం ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ అనంతరం స్వాన్ మాట్లాడుతూ.. ‘రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతుందో నాకు అర్థం కావడం లేదు.  ఈ మ్యాచ్ (ముంబై-పంజాబ్) లో  బౌలర్లు  ముంబైని దిగజార్చారు.

58
Basil Thampi

ఒక్క జస్ప్రీత్ బుమ్రా తప్ప మిగతా బౌలర్లంతా భారీగా పరుగులిచ్చుకున్నారు. పంజాబ్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ లే తొలి వికెట్ కు పది ఓవర్ల లోపే 99 పరుగులు జోడించారు. దీనిని బట్టి ముంబై బౌలర్లు ఎంత దారాళంగా పరుగులిచ్చారో అర్థం చేసుకోవచ్చు. 

68

బుమ్రా మిడిల్ ఓవర్లలో కాస్త కట్టుదిట్టంగా బంతులేసేసరికి పంజాబ్ స్కోరు ఆమాత్రం అదుపులోకి వచ్చింది. అయితే ఈ విషయంలో అందరూ రోహిత్ కెప్టెన్సీ వైపే వేలెత్తి చూపుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. క్రికెట్ అనేది కలిసి కట్టుగా ఆడే ఆట..’ అని చెప్పాడు.

78

కాగా వరుసగా ఐదు మ్యాచులు ఓడేసరికి  ముంబై ఇండియన్స్ జట్టు బాధ్యతలను రోహిత్ వదులుకుంటే మంచిదని  విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  కెప్టెన్సీ భారం కారణంతా హిట్ మ్యాన్ తన లోని ఆటగాడిని పూర్తిస్థాయిలో బయటకు తీయడం లేదని అంటున్నారు. భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా రెండ్రోజుల క్రితం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

88

రోహిత్.. ముంబై కెప్టెన్సీ బాధ్యతలను  వదులుకుని వాటిని కీరన్ పొలార్డ్ కు అప్పజెప్పాలని తద్వారా హిట్ మ్యాన్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతాడని  మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. 

Read more Photos on
click me!

Recommended Stories