ఇదే నిజమైతే అతడు అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరుగబోయే టీ20 ప్రపంచకప్ లో కూడా అందుబాటులో ఉండటం అనుమానంగానే ఉంది. పొట్టి ప్రపంచకప్ వరకు అతడు కోలుకున్నా.. చాహర్ ఎంతమేర ఫిట్నెస్ గా ఉండగలడు..? పాత గాయాలేమైనా తిరగబెడితే అతడి పరిస్థితేంటి..? అనేది ఇప్పుడు టీమిండియా అభిమానులతో పాటు బోర్డును కూడా కలవరపరుస్తున్నది.