పాక్ ప్లేస్‌లో టీమిండియా ఉండి ఉంటే, ఇలా చేసేవాళ్లా?... ఇంగ్లాండ్, కివీస్‌లపై ఆసీస్ ప్లేయర్ కామెంట్...

First Published Sep 25, 2021, 4:27 PM IST

18 ఏళ్ల తర్వాత తొలిసారిగా పాకిస్తాన్ పర్యటనకి వెళ్లిన న్యూజిలాండ్ జట్టు, వన్డే సిరీస్ ఆరంభానికి కొన్ని నిమిషాల ముందు అర్ధాంతరంగా టూర్‌ను రద్దు చేసుకుని, స్వదేశానికి వెళ్లిపోయింది... ఆటగాళ్ల భద్రతపై అనుమానాలు రావడంతో ‘సెక్యూరిటీ’ కారణాల టూర్‌ను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది న్యూజిలాండ్...

పాకిస్తాన్‌కి వెళ్లి, అక్కడి పరిస్థితులు చూసిన న్యూజిలాండ్ జట్టే, భయపడి టూర్ నుంచి అర్ధాంతరంగా వచ్చేయడంతో వచ్చే నెలలో పాక్‌లో పర్యటించాల్సిన ఇంగ్లాండ్ జట్టు కూడా ‘మేం కూడా రాలేం’ అంటూ ప్రకటించింది...

ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి టాప్ టీమ్స్‌... ఇలా అర్ధాంతరంగా టూర్‌లను రద్దు చేసుకోవడంతో ఆ ప్రభావం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై తీవ్రంగా పడింది...

‘పాకిస్తాన్ కాబట్టి, మ్యాచ్ ఆడలేం అంటూ ఈజీగా చెప్పేశారు... అదే స్థానంలో భారత్ ఉండి ఉంటే... ఇలా చేసేవాళ్లా? ఇండియాకి వెళ్లి, వన్డే సిరీస్ ఆరంభానికి ముందు అర్ధాంతరంగా టూర్ నుంచి తప్పుకుంటున్నామని చెప్పగలరా...

అంత దమ్ము, ధైర్యం ఎవ్వరికీ ఉండదు. ఎందుకంటే అందరికీ డబ్బు కావాలి. డబ్బుంటే సెక్యూరిటీ రీజస్ కనిపించవు... పాకిస్తాన్‌లో నేనెప్పుడూ అభద్రతాభావానికి గురి కాలేదు...

భారత్‌ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. కాబట్టి ఎన్నో సిరీస్‌లు నిర్వహిస్తూ, అన్ని దేశాలు తమ దగ్గరికి వచ్చేలా చూసుకుంది. అందుకే టీమిండియాకి వెళ్లి, ఏ జట్టూ ఇలా వెనక్కి రాలేదు...

పాకిస్తాన్‌ సూపర్ లీగ్‌ను విజయవంతంగా జనాల మధ్య నిర్వహించారు. అవును నిజమే ఒకప్పుడు పాక్‌లో పరిస్థితి వేరేగా ఉండేది. అయితే అది పదేళ్ల కిందట మాట. ఇప్పుడు పరిస్థితి చాలా మారిపోయింది...

Rohit Sharma- Eoin Morgan -Photo Credit BCCI

పాకిస్తాన్‌లో ఎలాంటి భయాందోళనలు లేకుండా మ్యాచులు ఆడొచ్చు. పాక్ టూర్‌ను రద్దు చేసుకున్న ఇంగ్లాండ్ ప్లేయర్లు, ఐపీఎల్ ఎలా ఆడుతున్నారు...’ అంటూ కామెంట్ చేశాడు ఆసీస్ ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా...

పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో జన్మించిన ఉస్మాన్ ఖవాజా, ఆస్ట్రేలియాకి వలసవెళ్లి అక్కడే సెటిల్ అయ్యాడు... ఆసీస్ తరుపున 44 టెస్టులు, 40 వన్డేలు ఆడిన ఖవాజా, 4300+ పరుగులు చేశాడు...

న్యూజిలాండ్, పాకిస్తాన్ టూర్‌ను రద్దు చేసుకున్న తర్వాత బిజీబిజీ షెడ్యూల్ కారణంగా బయో బబుల్ లైఫ్‌తో విసిగి విసారిపోయిన ప్లేయర్లకు కాస్త ఉపశమనం, విశ్రాంతి ఇచ్చేందుకు పాకిస్తాన్‌ టూర్‌ను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు...

click me!