IPL 2021: మాహీ ఇప్పటికైనా కాస్త బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టు... గౌతమ్ గంభీర్ కామెంట్...

First Published Sep 25, 2021, 3:27 PM IST

ఐపీఎల్ 2020 సీజన్‌లో దారుణంగా ఫెయిల్ అయిన చెన్నై సూపర్ కింగ్స్, 2021లో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది... ఇప్పటికే 9 మ్యాచుల్లో ఏడింట్లో విజయాలు అందుకున్న సీఎస్‌కే, పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. మరో మ్యాచ్ గెలిస్తే, మిగిలిన ఫ్రాంఛైజీల సంబంధాలు లేకుండా నేరుగా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తుంది...

Dhoni-Raina, Photo Credit CSK

చెన్నై సూపర్ కింగ్స్ టేబుల్ టాపర్‌గా ఉన్నప్పటికీ, మాహీ ఫ్యాన్స్‌కి ఇప్పటిదాకా సరైనా మాస్ మసాలా ఇన్నింగ్స్ రుచిచూసే అదృష్టం దొరకలేదు...

ఇప్పటిదాకా 9 మ్యాచులు ఆడిన ఎమ్మెస్ ధోనీ, 12.75 యావరేజ్‌లో టోర్నీ మొత్తం కలిసి 51 పరుగులు మాత్రమే చేయగలిగాడు... అత్యుత్తమ స్కోరు 18 పరుగులు మాత్రమే...

2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ లాంటి కీలక మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ తీసుకున్న ఎమ్మెస్ ధోనీ, ఈసారి మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకిందకీ వెళ్తున్నాడు...

‘ఇప్పటికే సీఎస్‌కే మంచి పొజిషన్‌లో ఉంది. ప్లేఆఫ్ చేరుకోవడం ఖాయమైంది. కనీసం ప్లేఆఫ్స్‌కి క్వాలిఫై అయిన తర్వాతైనా ఎమ్మెస్ ధోనీ మిడిల్ ఆర్డర్‌లో సాధ్యమైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాలి...

సీఎస్‌కే జట్టు బాగా ఆడుతోంది. అయితే కెప్టెన్ ముందుండి నడిపిస్తే, చూడడానికి ఇంకా బాగుంటుంది. లేదంటే మిగిలిన ప్లేయర్ల కష్టానికి, క్రెడిట్ మాహీకి ఇచ్చినట్టు అవుతుంది...

MS Dhoni

టాపార్డర్ రాణిస్తూ, జట్టుకి విజయాలు తెస్తున్నారు కాబట్టి సరిపోయింది. వాళ్లు ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? ముంబైతో మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ లేకపోతే చెన్నై పరిస్థితి ఏమయ్యేది...

ఎమ్మెస్ ధోనీ మూడు, నాలుగో స్థానంలో వచ్చి బ్యాటింగ్ చేయాలి. ప్లేఆఫ్స్‌కి క్వాలిఫై అయిన తర్వాతి మ్యాచుల్లో ఎలా ఆడినా పెద్దగా ప్రభావం చూపదు కాబట్టి, మాహీ క్రీజులో ఎక్కువసేపు గడపడానికి అవకాశం దొరుకుతుంది...

మాహీ పరుగులు చేస్తే, ప్లేఆఫ్స్‌లో జట్టు ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది... ’ అంటూ కామెంట్ చేశాడు కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్...

2019లో 83.20 యావరేజ్‌తో 416 పరుగులు చేసిన ఎమ్మెస్ ధోనీ, గత సీజన్‌లో 25 సగటుతో 200 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు...

ఈ సీజన్‌లో మాత్రం అంబటిరాయుడు, మొయిన్ ఆలీ, డుప్లిసిస్, రుతురాజ్ గైక్వాడ్, సురేష్ రైనా వంటి ప్లేయర్లు రాణిస్తుండడంతో మాహీకి పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు...  

click me!