నో వార్నర్, నో ఎస్‌ఆర్‌హెచ్... మా వార్నర్ భాయ్‌ని వెనక్కితెండి... సోషల్ మీడియాలో బీభత్సమైన...

First Published May 3, 2021, 9:50 PM IST

పీఎల్ 2021 సీజన్ మధ్యలో డేవిడ్ వార్నర్‌తో ఏర్పడిన విబేధాల కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి మ్యాచ్‌లో తుది జట్టులో కూడా వార్నర్ భాయ్‌కి చోటు కరువైంది. దీంతో ఆరెంజ్ ఆర్మీ అభిమానులు, మళ్లీ వార్నర్ భాయ్‌ని వెనక్కి తేవాలంటూ సోషల్ మీడియా వేదికగా గళం వినిపిస్తున్నారు.

డేవిడ్ వార్నర్ లేకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఊహించుకోవడం అంటే పాటలు లేకుండా తెలుగు సినిమా తీయడం లాంటిదే. జట్టుతో ఎంతో అనుబంధం ఏర్పరుచుకున్న డేవిడ్ వార్నర్, తన ఫ్యామిలీతో కలిసి కూడా ఆరెంజ్ ఆర్మీకి మద్ధతుగా నిలిచాడు.
undefined
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచులకు ముందు డేవిడ్ వార్నర్ భార్యా, పిల్లల అందరూ ఆరెంజ్ ఆర్మీ జెర్సీలు ధరించి, శుభాకాంక్షలు తెలిపేవారు. మిగిలిన జట్లకు నాయకత్వం వహిస్తున్న విదేశీ క్రికెటర్ల ఫ్యామిలీలు కాదు కదా, మన క్రికెటర్ల ఫ్యామిలీలు కూడా ఇంతగా అటాచ్ అవ్వలేదు...
undefined
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును నాలుగు సార్లు ఫ్లేఆఫ్ చేరి, 2016లో 800+ పైగా పరుగులు చేసి... ఐపీఎల్ టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్‌ను ఇలా జట్టులో నుంచి తీసేసి అవమానిస్తుంటే చూస్తూ సహించబోమని అంటున్నారు ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు...
undefined
వాస్తవానికి డేవిడ్ వార్నర్‌కి బీర్, వైన్ తాగడం అంటే చాలా ఇష్టం. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తేందుకు ఏడాది పాటు మద్యాపానానికి పూర్తిగా దూరంగా ఉన్నాడు వార్నర్...
undefined
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత డేవిడ్ వార్నర్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది. ఆసీస్ జట్టుకి బ్యాటుతో చేసిన పరుగుల కంటే, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కెప్టెన్‌గా వార్నర్ చేసిన పరుగులే ఎక్కువ...
undefined
148 మ్యాచుల్లో 50 హాఫ్ సెంచరీలతో 5 వేలకు పైగా పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, లీగ్‌లో అత్యధిక పరుగులు చేసి ఫారిన్ ప్లేయర్‌గా టాప్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్ కూడా వార్నర్ భాయే...
undefined
జట్టు విజయం కోసం టీమ్‌లో కేన్ విలియంసన్ ఉండాలి. కానీ వార్నర్ భాయ్ లేకపోతే అది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టే కాదు... ఎందుకంటే డేవిడ్ వార్నర్ ఓ ఎమోషన్ అంటున్నారు ఆరెంజ్ ఆర్మీ అభిమానులు...
undefined
ఐపీఎల్‌లో బెస్ట్ టీ20 బ్యాట్స్‌మెన్‌గా క్రిస్ గేల్ కంటే రెట్టింపు ఓట్లు దక్కించుకున్నాడు డేవిడ్ వార్నర్. అలాంటి వార్నర్‌ను జట్టు సెలక్షన్ గురించి కామెంట్ చేశాడని కెప్టెన్సీ తొలగించి, జట్టులో నుంచి తప్పించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు అభిమానులు.
undefined
click me!