ధోనీ షాకింగ్ నిర్ణయం... కరోనాపై పోరాటానికి మద్దతుగా రూ.15 కోట్ల విరాళం... నిజమెంత?

Published : May 03, 2021, 08:03 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ... టీమిండియాకు రెండు వరల్డ్‌కప్స్ అందించిన మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్. ఐపీఎల్‌లో కూడా మూడు టైటిల్స్ గెలిచిన మాహీ... దేశంలో కరోనా విలయతాండవాన్ని చూసి చలించిపోయి రూ.15 కోట్లు విరాళంగా అందించాడని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వార్తలో నిజమెంత...

PREV
18
ధోనీ షాకింగ్ నిర్ణయం... కరోనాపై పోరాటానికి మద్దతుగా రూ.15 కోట్ల విరాళం... నిజమెంత?

ఐపీఎల్‌ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహారించడం ద్వారా ఏటా రూ.15 కోట్ల పారితోషికం అందుతోంది. ఈ మొత్తాన్ని భారత ప్రభుత్వానికి విరాళంగా ఇస్తున్నట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది.

28

కరోనాపై పోరాటానికి మద్ధతుగా రూ.8 కోట్ల 50 లక్షలు... ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.1.5 కోట్లు... సరైన సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్న ఆసుపత్రుల్లో బెడ్, ఆక్సిజన్, వెంటిలేటర్ల ఏర్పాటుకి రూ.7 కోట్లు ఇస్తున్నట్టు ఈ వార్త సారాంశం...

38

అయితే ఈ వార్తలో నిజం లేదు. ఎంతో దయార్థ హృదయం ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ, గత ఏడాది పూణెలో ఓ స్వచ్ఛంద సంస్థకు ఒక లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చాడు...

48

ఆ తర్వాత ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, సురేశ్ రైనా వంటి క్రికెటర్లు విరాళాలు ప్రకటించినా... ధోనీ మాత్రం తనకి ప్రపంచంతో సంబంధం లేనట్టు నిమ్మకుండిపోయాడు.

58

క్రికెట్‌లో ఎంతో విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందినా, చాలా వినయం, విధేయత కలిగిన క్రికెటర్‌గా పేరొందినా... డబ్బుల విషయంలో మహేంద్ర సింగ్ ధోనీ చాలా కమర్షియల్...

68

తన బయోపిక్ సినిమా హక్కులనే రూ.10 కోట్లకు అమ్మిన మహేంద్ర సింగ్ ధోనీ, కేవలం భారీగా డబ్బులు దక్కుతున్నాయనే ఉద్దేశంతో ఐపీఎల్‌ మాత్రమే ఆడుతున్నాడు. రైనా, అంబటి రాయుడు వంటి ప్లేయర్లు ఇతర దేశవాళీ లీగుల్లో ఆడుతున్నా, మాహీ మాత్రం వాటిలో ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

78

ఐపీఎల్ 2008 సీజన్ నుంచి ఇప్పటిదాకా ఆడుతున్న అతికొద్దిమంది ప్లేయర్లలో ఒకడైన మహేంద్ర సింగ్ ధోనీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా రూ.150 కోట్లకు పైగా మొత్తాన్ని ఆర్జించిన మొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.

88

కొన్నాళ్ల క్రితం మహేంద్ర సింగ్ ధోనీ ఛారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఒక స్వచ్ఛంధ సంస్థను ఏర్పాటు చేసిన మాహీ, ఎవ్వరికీ తెలియకుండా అవసరమైన వారికి ఎంతో సేవ చేస్తున్నారని, తాను చేసే సాయాన్ని చెప్పుకోవడం ఆయనకి ఇష్టం లేదని అనేవారు కూడా చాలామంది ఉన్నారు...

click me!

Recommended Stories