ఐపీఎల్ 2022 సీజన్‌లో ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా ఆడడం లేదు. చెన్నై సూపర్ కింగ్స్‌కి మూడు టైటిల్స్ అందించిన రైనాను ఏ జట్టూ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు...
ఐపీఎల్‌లో 9 సీజన్లలో 400+ పరుగులు చేసి, అందరికంటే టాప్‌లో ఉన్న సురేష్ రైనా, వ్యక్తిగత కారణాలతో 2020 సీజన్‌లో పాల్గొనలేదు...
29
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడినప్పటికీ కేవలం 160 పరుగులు మాత్రమే చేయగలిగాడు రైనా... ఐపీఎల్ 2021 సీజన్‌లో 114 పరుగులు చేసిన ఎమ్మెస్ ధోనీని కెప్టెన్‌గా అట్టిపెట్టుకున్న సీఎస్‌కే, మాహీ భాయ్ ఆప్తమిత్రుడిని కొనుగోలు చేయడానికి ఇష్టపడకపోవడం విశేషం...
39
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో దీపక్ చాహార్ కోసం రూ.14.25 కోట్లు చెల్లించడానికి సిద్ధమైన చెన్నై సూపర్ కింగ్స్, రైనా కోసం బేస్ ప్రైజ్ ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు...
49
ఐపీఎల్ కెరీర్‌లో 5500+ పైగా పరుగులు చేసిన సురేష్ రైనా, టీమిండియా కంటే చెన్నై సూపర్ కింగ్స్ తరుపునే అద్భుతంగా రాణించి, ‘మిస్టర్ ఐపీఎల్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు...
59
ఐపీఎల్‌లో ఆడితే చెన్నై సూపర్ కింగ్స్ తరుపునే ఆడతానని, మరో ఫ్రాంఛైజీకి ఆడబోనని గతంలో సురేష్ రైనా కామెంట్ చేశాడు. ఈ కారణాలతోనే మిగిలిన ఫ్రాంఛైజీలు రైనాని కొనడానికి ఆసక్తి చూపించలేదని సమాచారం...
69
ఐపీఎల్‌లో ఐదు సెంచరీలతో టాప్‌లో నిలిచిన ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ కూడా ఈసారి లీగ్‌లో పాల్గొనడం లేదు. 41 ఏళ్ల వయసులో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్న క్రిస్ గేల్, ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి రిజిస్టర్ చేసుకోలేదు...
79
అలాగే ఆర్‌సీబీలో స్టార్ ప్లేయర్, విరాట్ కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్ ఏబీ డివిల్లియర్స్ కూడా ఐపీఎల్ 2022 సీజన్‌లో పాల్గొనడం లేదు...
89
మూడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ఏబీ డివిల్లియర్స్, ఈ ఏడాది అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే...
99
ఐపీఎల్‌కి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ రావడానికి కారణమైన క్రిస్ గేల్, ఏబీ డివిల్లియర్స్, సురేష్ రైనా ముగ్గురూ లేకుండా మొట్టమొదటిసారిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరగనుంది...