మోస్ట్ వాంటెడ్‌గా మారిన అండర్-19 వరల్డ్ కప్ హీరోలు.. తెలుగు క్రికెటర్లకు..

Published : Feb 13, 2022, 03:56 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో అండర్-19 వరల్డ్ కప్ 2022 టోర్నీ గెలిచిన ప్లేయర్లు మంచి ధరను దక్కించుకోగలిగారు. అండర్ 19 వరల్డ్ కప్ విన్నంగ్ కెప్టెన్ యశ్ ధుల్‌తో పాటు ఆల్‌రౌండర్లు, బౌలర్లు మంచి ధరను దక్కించుకోగలిగారు... 

PREV
110
మోస్ట్ వాంటెడ్‌గా మారిన అండర్-19 వరల్డ్ కప్ హీరోలు.. తెలుగు క్రికెటర్లకు..

అండర్-19 ఆల్‌రౌండర్ ప్లేయర్ లలిత్ యాదవ్‌ను రూ. 65 లక్షలకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు...రిపల్ పటేల్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ఢిల్లీ. 

210

అండర్-19 వరల్డ కప్ విన్నింగ్ కెప్టెన్ యశ్ ధుల్ కోసం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడ్డాయి. యశ్ ధుల్‌ను రూ.50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది...

310

తెలుగు క్రికెటర్, ఆల్‌రౌండర్ ఎన్. తిలక్ వర్మను రూ.1.70 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. మహిపాల్ లోమరోర్‌ను రూ. 95 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు కొనుగోలు చేసింది. 

410

అనుకూల్ రాయ్‌‌ను కేకేఆర్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. దర్శన్ నాల్కండేను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్... 

510

అండర్ 19 వరల్డ్ కప్‌లో అదరగొట్టిన బౌలర్ విక్కీ ఓస్త్వాల్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు. సంజయ్ యాదవ్‌ను రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్... 

610

అండర్ 19 వరల్డ్ కప్ హీరో రాజ్ ఆనంద్ బవా కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీపడ్డాయి. అండర్ 19 వరల్డ్ కప్ హీరో  రాజ్ బవాని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్... 
 

710

అండర్ 19 వరల్డ్ కప్ ఆల్‌రౌండర్ రాజవర్థన్ హంగార్కెగర్‌ను రూ.70 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్ జట్టు..

810

అండర్ 19  ఫాస్ట్ బౌలర్ వసు వాట్స్‌, యష్ ఠాకూర్‌, అర్జన్ నగ్వస్‌వాలా, ముజ్తబా యూసఫ్‌, కుల్దీప్ సేన్‌, ఆకాశ్ సింగ్‌లను ఏ జట్టూ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. 

910

యష్ దయాల్‌ను కొనుగోలు చేయడానికి గుజరాత్, కోల్‌కత్తా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీపడ్డాయి. యష్ దయాల్‌ను రూ. 2.8 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్... 

1010

సిమర్‌జీత్ సింగ్‌‌ను ఐపీఎల్ 2022 మెగా వేలంలో బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్.. 

click me!

Recommended Stories