ఆడని జోఫ్రా ఆర్చర్‌కి, అన్‌క్యాప్డ్ టిమ్ డేవిడ్‌కి భారీ ధర పెట్టిన ముంబై... సన్‌రైజర్స్‌లోకి రొమారియా...

Published : Feb 13, 2022, 05:43 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో ఐదు సార్లు టైటిల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఎవ్వరికీ అర్థం కాని స్ట్రాటెజీతో ముందుకు వెళ్తోంది. గాయం కారణంగా ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆడని జోఫ్రా ఆర్చర్‌కి, అన్‌క్యాప్డ్ ప్లేయర్ కోసం ఏకంగా రూ.16 కోట్లకు పైగా ఖర్చు చేసింది ముంబై ఇండియన్స్..

PREV
111
ఆడని జోఫ్రా ఆర్చర్‌కి, అన్‌క్యాప్డ్ టిమ్ డేవిడ్‌కి భారీ ధర పెట్టిన ముంబై... సన్‌రైజర్స్‌లోకి రొమారియా...

రోవ్‌మన్ పావెల్‌ను రూ.2.8 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్... ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కోసం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ పడ్డాయి. జోఫ్రా ఆర్చర్‌ను రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్... 

211

ఫిన్ అలెన్‌ను రూ. 80 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... న్యూజిలాండ్ ప్లేయర్ డివాన్ కాన్వేని రూ.1 కోటికి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... 

311

ఎవిన్ లూయిస్, అలెక్స్ హేల్స్, కరణ్ నాయర్‌,  సిద్ధార్థ్ కౌల్, రీసీ టాప్లే, ఆండ్రూ టైలను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు... 

411

చరిత్ అసలంక, జార్జ్ గార్టన్, రహ్మనుల్లా గుర్భాజ్, బెన్ మెక్‌డర్మెట్, గ్లెన్ ఫిలిప్స్, నాథన్ ఎల్లీస్, ఫజల్ హక్ ఫారుఖి,సందీప్ వారియర్‌లను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ఇష్టపడలేదు... 

511


మిచెల్ సాంట్నర్‌ను రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...రొమారియో షెపర్డ్‌ను రూ.7.75 కోట్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

611

సూపర్ ఫామ్‌లో ఉన్న భారత సీనియర్ ఆల్‌రౌండర్ రిషీ ధావన్‌ను రూ.55 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్... డ్వేన్ ప్రిటోరియస్‌ను రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

711

రూథర్‌ఫోర్డ్‌ని రూ.కోటికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. డేనియల్ శామ్స్‌ని రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్...
 

811

తైమాల్ మిల్స్‌ను రూ. 1.5 కోట్లకి ముంబై ఇండియన్స్ జట్టు దక్కించుకుంది. ఆడమ్ మిల్నేని రూ. 1.9 కోట్లకు దక్కించుకుంది చెన్నై సూపర్ కింగ్స్...

911

సుభ్రాన్షు సేనాపతిని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... టిమ్ డేవిడ్‌ని కొనుగోలు చేయడానికి కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు పోటీ పడ్డాయి. అన్‌క్యాప్డ్ ప్లేయర్ టిమ్ డేవిడ్ రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్ జట్టు...

1011

సుయాన్ష్‌ ప్రభుదేశాయ్‌ని రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వైభవ్ అరోరాని కొనుగోలు చేయడానికి కోల్‌కత్తా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ పోటీపడ్డాయి. వైభవ్ అరోరాని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్ జట్టు...

1111


చామ మిలింద్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ. 25 లక్షలకు కొనుగోలు చేసింది. విష్ణు సోలంకి కోసం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటీ పడ్డాయి. విష్ణు సోలంకిని రూ. 1.2 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... 

click me!

Recommended Stories