మాటలు చెప్పడం కాదు, దమ్ముంటే ఆ పోస్టుకి అప్లై చేయండి... మాజీ క్రికెటర్లకు ఫ్యాన్స్ డిమాండ్...

Published : Nov 20, 2022, 10:31 AM ISTUpdated : Nov 20, 2022, 01:18 PM IST

మాటలు చెప్పడం చాలా సులువు, అయితే చేతుల్లో చేసి చూపించడమే చాలా కష్టం. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా ఓటమి తర్వాత సెలక్షన్ కమిటీపై వేటు వేసింది టీమిండియా. ఈ టోర్నీకి ఎంపిక చేసిన జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అప్పుడు విమర్శలు చేసిన వారిని ఇప్పుడు అటాక్ చేస్తున్నారు టీమిండియా డై హార్ట్ ఫ్యాన్స్...

PREV
17
మాటలు చెప్పడం కాదు, దమ్ముంటే ఆ పోస్టుకి అప్లై చేయండి... మాజీ క్రికెటర్లకు ఫ్యాన్స్ డిమాండ్...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ని ఎంపిక చేయకపోవడం, ఉమ్రాన్ మాలిక్‌, పృథ్వీ షా వంటి ప్లేయర్లను పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌గా మారిన కొందరు మాజీ క్రికెటర్లు..

27
team India

37 ఏళ్ల వయసులో దినేశ్ కార్తీక్‌ని టీ20 వరల్డ్ కప్‌కి ఎంపిక చేయడంపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి... అంతకుముందు 2021 టీ20 వరల్డ్ కప్ సమయంలో కూడా ఇలాంటి ట్రోల్స్ బాగానే వినిపించాయి. ఐపీఎల్ పర్ఫామెన్స్ ఆధారంగా వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహార్‌లను మెగా టోర్నీకి ఎంపిక చేసిన సెలక్టర్లు, యజ్వేంద్ర చాహాల్‌ని పక్కనబెట్టి తీవ్ర వివాదాస్పదమైంది..

37
Team India

అనుకున్నట్టుగానే వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహాల్... ఐసీసీ టోర్నీలో అట్టర్ ఫ్లాప్ అయ్యారు...
ఆసియా కప్ టోర్నీకి ముందు ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఫ్లాప్ అయ్యాడు. దీంతో విరాట్‌ని టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఎంపిక చేయడమే వేస్ట్ అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌తో పాటు భారత మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్, ఆర్‌పీ సింగ్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు...

47
Image credit: Getty

అయితే ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఫ్ఘాన్‌పై శతకం బాది మూడేళ్ల సెంచరీ బ్రేక్‌ని బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో హైయెస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. తనపై వచ్చిన విమర్శలకు బ్యాటుతోనే సమాధానం చెప్పాడు...
 

57

టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకి టాప్ స్కోరర్‌ అవుతాడని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేసిన కెఎల్ రాహుల్ అట్టర్ ఫ్లాప్ అయ్యి, భారత జట్టు సెమీస్ నుంచే ఇంటిదారి పట్టడానికి కారణమయ్యాడు.. ఇప్పుడు బీసీసీఐ పద్ధతి మారి, సెలక్షన్ కమిటీపై వేటు వేసింది...

67

కొత్త సెలక్షన్ కమిటీ కోసం దరఖాస్తులు కోరుతోంది బీసీసీఐ.. టీమిండియాకి వాళ్లని ఎంపిక చేయాలి? వీళ్లని ఎంపిక చేయొద్దు అంటూ మాటలు చెప్పే మాజీ క్రికెటర్లు... సెలక్టర్ల పొజిషన్‌కి అప్లై చేసి, మంచి టీమ్‌ని ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్..

77

టీమిండియా మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, పార్థివ్ పటేల్‌లకు సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు చాలా కనిపిస్తున్నాయి. గౌతమ్ గంభీర్ కూడా సెలక్టర్ అయితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు తమని తాము క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌గా చెప్పుకున్న వారిని కూడా టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు...

click me!

Recommended Stories