ఇకనైనా సిగ్గు తెచ్చుకోండి! ఇండియాకి ఆడుతున్నారు... వరల్డ్ కప్ దాకా నో రెస్ట్! గవాస్కర్ ఫైర్...

First Published Dec 5, 2022, 1:07 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీమిండియాలో చాలా మార్పులు జరిగాయి. విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోగా, రవిశాస్త్రి నుంచి రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. అయితే ఈ మార్పుల తర్వాత టీమిండియా అలవర్చుకున్న వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి...

Rohit Sharma

రోహిత్ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏడాదిలో 8 మంది తాత్కాలిక కెప్టెన్లను మార్చాల్సి వచ్చింది... స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మే టీమ్‌కి పూర్తిగా అందుబాటులో లేడని చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ... విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, బుమ్రా, షమీ... ఇలా సీనియర్లు ఆడిన మ్యాచుల కంటే రెస్ట్ తీసుకున్న సందర్భాలే ఎక్కువ...

Image credit: PTI

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌కి రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ వంటి సీనియర్లు దూరంగా ఉన్నారు. దాదాపు మూడు వారాల విశ్రాంతి తర్వాత బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చారు వీళ్లు...

అయితే వన్డే సిరీస్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ సెషన్స్‌లో మహ్మద్ షమీ గాయపడి, వన్డే సిరీస్‌కి దూరమయ్యాడు. మరోవైపు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో బ్యాటింగ్‌లో ఫెయిల్ అయ్యారు. కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నా, వికెట్ కీపింగ్‌లో ఈజీ క్యాచులను నేలపాలు చేశాడు.

సీనియర్లకు వరుసగా రెస్ట్ ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్... ‘ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. ప్లేయర్లకు అతిగా రెస్ట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. మాటిమాటికీ టీమ్‌ని మారుస్తుండడం మంచిది కాదు. ప్లేయర్లు ఇకపై బ్రేకులు తీసుకోరని అనుకుంటున్నా... వరల్డ్ కప్‌కి పెద్దగా సమయం లేదు. వరల్డ్ కప్‌లో ఏ టీమ్‌ని అయితే ఆడించాలని అనుకుంటున్నారో అందరూ ఇకపై జరిగే ప్రతీ సిరీస్ ఆడాలి...

మీరు టీమిండియాకి ఆడుతున్నారు. ఏదో క్లబ్ క్రికెట్‌లో ఆడుతున్నట్టుగా కుటుంబంతో గడపాలని, మరేదో కారణం చెప్పి రెస్ట్ కోరుకోవడం కరెక్ట్ కాదు... అవసరమైతే ఒకటి రెండు మార్పులు చేయడంలో తప్పు లేదు. అయితే ప్రధాన ప్లేయర్లు మాత్రం ప్రతీ వన్డే ఆడాలి. వాళ్లకు రెస్ట్ ఇవ్వకూడదు...

Sunil Gavaskar

వరల్డ్ కప్ గెలవాలంటే ఇకపై ఒకే టీమ్, ఒకే కెప్టెన్‌ ఫార్ములాని అలవర్చుకోండి. సిరీస్‌కో కెప్టెన్‌గా మారుస్తూ ఉంటే టీమ్ కాంబినేషన్ దెబ్బ తింటుంది. ఒకే జట్టుతో ఆడుతూ ఉంటే లోపాలను తెలుసుకోవడానికి సమయం దొరుకుతుంది....’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా టాపార్డర్ ఫెయిల్యూర్‌తో  41.2 ఓవర్లలో 186 పరుగులకి ఆలౌట్ అయ్యింది... ఈ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది బంగ్లాదేశ్... 
 

click me!