2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు రోహిత్ శర్మ. కేప్ టౌన్ టెస్టు తర్వాత మూడు ఫార్మాట్లలో రెగ్యూలర్ కెప్టెన్‌గా మారాడు. అయితే ఫిట్‌నెస్, బిజీ షెడ్యూల్ తదితర కారణాల వల్ల టీమిండియాకి గత రెండేళ్లలో 9 మంది కెప్టెన్లు మారారు..
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కి హార్ధిక్ పాండ్యా, ఆ తర్వాత ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కి జస్ప్రిత్ బుమ్రా, ఆసియా కప్‌కి రోహిత్ శర్మ కెప్టెన్లుగా వ్యవహరించబోతుంటే ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టుకి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ చేయబోతున్నాడు.
28
అయితే సిరీస్‌కో కెప్టెన్ మారడం వల్ల రోహిత్ శర్మకు రావాల్సినంత గుర్తింపు రావడం లేదు. అదీకాకుండా ఐపీఎల్ సక్సెస్‌తో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ, అనుకున్నంత సక్సెస్ కూడా సాధించలేకపోయాడు..
38
Sanju Samson and Ruturaj Gaikwad
తాజాగా స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, టీమిండియా కెప్టెన్‌ని ఘోరంగా అవమానించింది. ఆగస్టు 30 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ 2023 టోర్నీకి ప్రోమోను రూపొందించింది స్టార్ స్పోర్ట్స్. ప్రోమోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కనిపించినా, ఆసియా కప్ 2023 పోస్టర్‌లో అతను కనిపించలేదు..
48
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, బంగ్లా వన్డే కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌లతో పాటు నేపాల్ మాజీ కెప్టెన్ సందీప్ లమిచానే, ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్‌లకు పోస్టర్‌లో చోటు కల్పించింది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్..
58
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ పోస్టర్‌లో చోటు కల్పించకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, రోహిత్ శర్మను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. రోహిత్ కేవలం పేరుకి మాత్రమే కెప్టెన్‌గా మారాడని, అతన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదని కామెంట్లు పెడుతున్నారు..
68
అయితే సెప్టెంబర్ 2న జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పోస్టర్‌లో మాత్రం విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా కనిపించాడు. పాకిస్తాన్ తరుపున బాబర్ ఆజమ్‌తో పాటు షాహీన్ ఆఫ్రిదీ ఈ పోస్టర్‌లో కనిపించాడు..
78
అంతెందుకు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ సోషల్ మీడియా వాల్ పోస్టర్‌లోనే రోహిత్ శర్మ కనిపించడు. విరాట్ కోహ్లీతో పాటు హార్ధిక్ పాండ్యా, మహిళా టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానలకు క్రికెట్ నుంచి చోటు కల్పించింది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్..
88
కెప్టెన్ ఎవ్వరైనా విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ కారణంగా అతనికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్. అందుకే రోహిత్ శర్మను కావాలనే పట్టించుకోవడం లేదని అంటున్నారు హిట్‌మ్యాన్ ఫ్యాన్స్..