ధోనీ, బీహార్‌కి ఆడుతుంటే చూశాం! సౌరవ్ గంగూలీకి ఒకే విషయం చెప్పా... మాజీ సెలక్టర్ సబా కరీం కామెంట్స్...

First Published Aug 5, 2023, 3:20 PM IST

రాహుల్ ద్రావిడ్ తర్వాత సరైన వికెట్ కీపర్ కోసం కొన్నేళ్ల పాటు ఎన్నో ప్రయత్నాలు చేసింది టీమిండియా. పార్థివ్ పటేల్, అజయ్ రత్రా, దినేశ్ కార్తీక్, నమన్ ఓజా.. ఇలా ఎందరో వికెట్ కీపర్లు టీమ్‌లోకి అలా వచ్చి ఇలా వెళ్లారు. ధోనీ వచ్చాకే, వికెట్ కీపర్లకు క్రేజ్ పెరిగింది..

ప్రస్తుతం టీమిండియాకి సీనియర్ మోస్ట్ దినేశ్ కార్తీక్‌, వృద్ధిమాన్ సాహాలతో పాటు రిషబ్ పంత్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్,  కెఎల్ రాహుల్, జితేశ్ శర్మ ఇలా అరడజను మంది ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితి రావడానికి ధోనీయే కారణం..


‘నేను మొదటిసారి ధోనీని చూసినప్పుడు అతను రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. బీహార్ టీమ్‌కి ఆడుతున్నాడు. బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌ స్కిల్స్‌ని దగ్గర్నుంచి గమనించా. తన బ్యాటింగ్ చూసి ఫిదా అయిపోయా. స్పిన్ బౌలింగ్‌లో అయినా పేస్ బౌలింగ్‌లో అయినా భారీ షాట్లు ఆడుతున్నాడు..

Latest Videos


Dhoni

మంచి ఫుట్‌వర్క్ ఉన్న వికెట్ కీపర్ కోసం చూస్తున్నాం. కానీ మాహీ ఫుట్‌వర్క్ నాకు పెద్దగా నచ్చలేదు. అందుకే ఫుట్‌వర్క్ ఇంప్రూవ్ చేసుకొమ్మని చెప్పాం. ధోనీ గ్రేట్‌నెస్ ఏంటంటే అతనికి ప్రతీ విషయం గుర్తుంటుంది. చెప్పిన ప్రతీ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటాడు..

Dhoni Batting


కెన్యాలో ఇండియా A, పాకిస్తాన్ A, కెన్యా మధ్య ట్రై సిరీస్ జరిగింది. దినేశ్ కార్తీక్ అప్పటికే టీమిండియాకి వికెట్ కీపర్‌గా ఉండడంతో ఇండియా A తరుపున ధోనీకి ఆడే ఛాన్స్ దక్కింది. ఆ సిరీస్‌లో అతని వికెట్ కీపింగ్ చాలా అద్భుతంగా అనిపించింది..

ఫుట్‌వర్క్ చాలా పెంచాడు. ఇక బ్యాటింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు, చితక్కొట్టేశాడు. ఆ సిరీస్‌లో అతను ఆడిన విధానం నాకు ఇంకా గుర్తుంది. అదే అతని కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అవుతుందని అనుకున్నా.  వెంటనే కోల్‌కత్తాకి వెళ్లి కెప్టెన్ సౌరవ్ గంగూలీని కలిశాను..

ms dhoni

టీమిండియా ఎలాంటి వికెట్ కీపర్ కోసమైతే చూస్తుందో, అలాంటి వికెట్ కీపర్‌ బీహార్‌కి ఆడుతున్నాడని చెప్పా. అప్పటికి సౌరవ్, ధోనీని చూడలేదు. అందుకే మాహీని పాకిస్తాన్‌ టూర్‌కి సెలక్ట్ చేయలేదు. ఆ తర్వాత ధోనీ ఆటను చూసి టీమ్‌కి సెలక్ట్ చేయమని చెప్పాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు బీసీసీఐ మాజీ సెలక్టర్, మాజీ వికెట్ కీపర్ సబా కరీం.. 

click me!