జనాలకు నేను చూయింగ్ గమ్ నమిలినా కష్టమే! నా కాలర్ పైకి ఉన్నా కష్టమే... రియాన్ పరాగ్ కామెంట్స్..

Published : Aug 05, 2023, 12:30 PM IST

ఐపీఎల్‌ ద్వారా ఎంతో మంది యువ క్రికెటర్లు, ప్రపంచానికి పరిచయం అయ్యారు. వారిలో కొందరు టీమిండియాకి కూడా ఆడారు. అయితే ఐపీఎల్‌లో తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న యంగ్ ప్లేయర్లలో రియాన్ పరాగ్ పేరు టాప్‌లో ఉంటుంది...  

PREV
18
జనాలకు నేను చూయింగ్ గమ్ నమిలినా కష్టమే! నా కాలర్ పైకి ఉన్నా కష్టమే... రియాన్ పరాగ్ కామెంట్స్..
Riyan Parag

రాజస్థాన్ రాయల్స్‌కి ఆడే రియాన్ పరాగ్, ఐపీఎల్ 2023 సీజన్‌లో పెద్దగా మెప్పించలేకపోయాడు. 7 మ్యాచుల్లో 78 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే అతని యాటిట్యూడ్, రియాన్ పరాగ్‌పై తీవ్రమైన ట్రోలింగ్ రావడానికి కారణమైంది..

28
Riyan Parag

21 ఏళ్ల రియాన్ పరాగ్, ఎమర్జింగ్ ఆసియా కప్ టోర్నీలో, ఆ తర్వాత జరిగిన దేవ్‌ధర్ ట్రోఫీలో మంచి పర్ఫామెన్స్ చూసి, క్రికెట్ విమర్శలను మెప్పించాడు. ఇప్పట్లో రియాన్ పరాగ్, టీమిండియాలోకి రావడం కష్టమే అయినా దేవ్‌ధర్ ట్రోఫీలో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ గెలిచి, సెలక్టర్ల దృష్టి పడ్డాడు...

38
Riyan Parag

‘నాపైన జనాలకు ఎందుకు ఇంత ద్వేషమో నాకైతే అర్థం కాదు. నేన చూయింగ్ గమ్ నమిలినా వాళ్లకు సమస్యే, నా కాలర్ పైకి ఉన్నా వాళ్లకు సమస్యే. క్యాచ్ పట్టిన తర్వాత సెలబ్రేట్ చేసుకున్నా కూడా ట్రోల్ చేసేస్తారు..

48
Riyan Parag

ఆఖరికి ఖాళీ సమయంలో గోల్ఫ్ ఆడుతున్నా సరే, దాన్ని కూడా పట్టుకుని ట్రోల్ చేశారు.. జనాలు, నన్ను ఇంతగా ట్రోల్ చేయడానికి కారణం ఏంటో నాకు తెలీదు. ఇలాగే ఆడాలని ఓ రూల్ బుక్ ఉంది. అయితే క్రికెటర్లు ఇలాగే ఉండాలని ఓ రూల్ బుక్ కూడా పెడితే మంచిదేమో..

58
RIYAN PARAG

టి షర్ట్ టక్ వేసుకుని ఉండాలి, కాలర్ కిందికే ఉండాలి. అందరినీ గౌరవించాలి, ఎవ్వరినీ సెడ్జ్ చేయకూడదని అని రాస్తే... వీళ్లకు కరెక్టుగా ఉంటుందేమో. నేను ఇవన్నీ నమ్మను. నేను కేవలం సరదా కోసమే క్రికెట్ ఆడడం మొదలెట్టాను..

68
riyan parag

ఇప్పుడు కూడా సరదా కోసమే క్రికెట్ ఆడుతున్నా. నేను ఈ స్థాయిలో క్రికెట్ ఆడడం చాలామంది జీర్ణించుకోలేకపోతున్నాను. నేను ఈ లెవెల్‌లో ఆడాల్సినంత గొప్ప ప్లేయర్‌ని కాదని వాళ్లు అనుకుంటున్నారు.. మా అమ్మ, నా హేటర్స్‌ని చూసి షాక్ అవుతూ ఉంటుంది..

78
Riyan Parag

ఆమెకు నేను ఒక్కటే చెప్పాను. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా అకౌంట్లకు దూరంగా ఉండమని చెప్పా. సోషల్ మీడియాకి దూరంగా ఉండేవాళ్లకు ఈ చెత్త అంతా తెలీదు. నేను కూడా ఈ విషయాలను పూర్తిగా పట్టించుకోవడం మానేశా...’ అంటూ కామెంట్ చేశాడు క్రికెటర్ రియాన్ పరాగ్..

88

దేవధర్ ట్రోఫీ 2023 టోర్నీలో 5 మ్యాచుల్లో 88.50 సగటుతో 354 పరుగులు చేశాడు రియాన్ పరాగ్. నార్త్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 131, వెస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 102 పరుగులు చేసిన రియాన్ పరాగ్, సౌత్ జోన్‌తో జరిగిన ఫైనల్‌లో 95 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..

click me!

Recommended Stories